telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉపేంద్ర ‘ఐ లవ్‌ యు’ టీజర్‌..

upendra i love u movie

కన్నడ సూపర్‌స్టార్స్‌లో ఒకరు, తెలుగు ప్రేక్షకుల్లోనూ సూపర్‌ స్టార్‌డమ్‌ సంపాదించుకున్న రియల్‌ స్టార్‌ ఉపేంద్ర హీరోగా నటించిన తాజా సినిమా ‘ఐ లవ్‌ యు’. ‘నన్నే… ప్రేమించు’ అనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్‌. తెలుగు పరిశ్రమకు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో దర్శకుడిగా పరిచయమైన ఆర్‌. చంద్రు, శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాకు నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా తెలుగు టీజర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన 

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ ‘‘నేను 1998లో ‘పెళ్లి పందిరి’, పవన్‌కల్యాణ్‌ ‘తొలిప్రేమ’ చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ అవుతున్న టైమ్‌. అప్పుడు ఉపేంద్రగారి సినిమాలను ‘తొలిప్రేమ’తో కంపేర్‌ చేస్తే.. పిచ్చి సినిమాలుగా అనిపించాయి. ‘ఇదేంటి? ఇలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారా?’ అనుకునేవాణ్ణి. తర్వాత తర్వాత నేను ‘ఆర్య’ స్ర్కిప్ట్‌ చూసినప్పుడు… ఉపేంద్రగారి సినిమాలు చూశా. ఆయన ఎలా చేశారు? బోల్డ్‌గా, నెగిటివ్‌గా వెళుతున్నప్పుడు క్యారెక్టర్‌ను ఎలా బ్యాలెన్స్‌ చేయాలి? అని ఆయన చూశా. ఈరోజు ఆయన సినిమా ఫంక్షన్‌కి రావడం సంతోషంగా ఉంది. ‘ఐ లవ్‌ యు’ సినిమా దర్శకుడు, నిర్మాత చంద్రు రెండు రోజులుగా నేను ఈ ఫంక్షన్‌కి రావాలని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఉపేంద్రగారితో పాటు ఆయన కోసం వచ్చాను. నా చేతుల మీదుగా మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసినందుకు ఐయామ్‌ హ్యాపీ. తెలుగులో, కన్నడలో సినిమా మంచి సక్సెస్‌ కావాలని ఆశిస్తున్నా’’ అన్నారు. 

ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీ పెద్దది ఎప్పుడు అవుతుందంటే… పెద్ద మనుషులు ఉంటేనే! ఈ రోజు పెద్ద నిర్మాతలు, దర్శకుడు, రచయితలు మా ఫంక్షన్‌కి రావడం సంతోషంగా ఉంది. నా గురించి గొప్పగా మాట్లాడుతుంటే నేను ఇంకా మంచి సినిమాలు చేయాలని ఇన్‌స్ఫైర్‌ అవుతున్నా. తెలుగులో చాలా బ్లాక్‌బస్టర్‌ సినిమాలు చేశారు. మీనుంచి నేను చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం స్ఫూర్తి తీసుకుంటున్నా. ఇప్పటికీ ఇంత యంగ్‌గా ఎలా ఉన్నారని అందరూ అడుగుతున్నారు. నా సీక్రెట్‌ ఒక్కటే… నేను ప్రతిదీ జీరో నుంచి మొదలుపెట్టా. చాలామంది అలాగే ప్రారంభించి ఉంటారు. అందుకే, పెద్దవాళ్ళు అయ్యారు. జీరో ఒక ప్లస్‌ ఏంటంటే… నథింగ్‌నెస్‌లో ఎవ్రీథింగ్‌ ఉంటుంది. మన దగ్గర ఏమీ లేదంటే అప్పుడు క్రియేటివిటీ స్టార్ట్‌ అవుతుంది. పెద్ద హీరోతో నా కెరీర్‌ స్టార్ట్‌ చేసి ఉంటే.. హీరో గురించి సినిమాకు ప్రేక్షకులు వస్తారని తక్కువ ఎఫ్టర్ట్స్‌ పెట్టేవాణ్ణి ఏమో! తెలియదు. చిన్న బడ్జెట్‌, కొత్తవాళ్ళతో చేసేటప్పుడు టైటిల్‌, పోస్టర్‌ డిజైన్‌ కూడా ఇంపార్టెంటే. థియేటర్‌ నుంచి బయటకు వెళ్ళాక నా సినిమా గురించి మాట్లాడాలంటే ప్రతి సన్నివేశం, మలుపు బావుండాలని ఆలోచించడానికి జీరోనే కారణం అయ్యింది. తర్వాత ఇప్పుడు జీరో నుంచి పొలిటికల్‌ పార్టీ స్టార్ట్‌ చేశా. ఎందుకు అంటే… రాజకీయాల్లో డబ్బులే సమస్య. రాజకీయాలు వ్యాపారంగా మారడంతో 20 శాతం మంది 80 శాతం మంది ఇన్నోసెంట్‌ పీపుల్‌ని రూల్‌ చేస్తున్నారు. అది మారాలని పార్టీ పెట్టాను. ఈ ‘ఐ లవ్‌ యు’ సినిమా గురించి చంద్రు చాలా చెప్పారు. సినిమాలో ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. సినిమా క్రెడిట్‌ అంతా ఆయనకే చెందుతుంది’’ అన్నారు.

లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ ‘‘ఉపేంద్రగారు రియల్‌ స్టార్‌, కల్ట్‌ స్టార్‌. నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ సినిమాల్లో ఆయన దర్శకత్వం వహించిన ‘ఓం’ సినిమా ఒకటి. నెల క్రితం మళ్ళీ చూశా. కన్నడలో ‘ఓం’ ఆ సినిమాను రీ రిలీజ్‌ చేస్తే బాగా ఆడిందని చెప్పారు. అలాగే, ఎన్నో సినిమాలు తీశారు. తెలుగులో ‘ఏ’ సినిమాతో కల్ట్‌ స్టార్‌గా యంగ్‌స్టర్స్‌లో పెద్ద ఫాలోయింగ్‌ సంపాదించుకున్నారు. మొన్నటికి మొన్న ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’లో మంచి క్యారెక్టర్‌ చేశారు. అందరి హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ‘ఏ’ + ‘ఉపేంద్ర’ = ‘ఐ లవ్‌ యు’ అని చెప్పడం నచ్చింది. టైటిల్‌ కంటే క్యాప్షన్‌ ‘నన్నే.. ప్రేమించు’ నాకు బాగా నచ్చింది. ఉపేంద్రగారికి మాత్రమే అటువంటి ట్యాగ్‌ సరిపోతుంది. ఈమధ్య తెలుగులో ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌.ఎక్స్‌ 100’ లాంటి కల్ట్‌ మూవీస్‌ వచ్చాయి. అటువంటి కల్ట్‌ మూవీగా ఈ సినిమా చేరుతుంది. ‘నన్నే… ప్రేమించు’ టైటిల్‌గా పెట్టి… ‘ఐ లవ్‌ యు’ క్యాప్షన్‌గా చేస్తే! ప్రేమ చిత్రాలకు కన్నడలో ఆర్‌. చంద్రు గాడ్‌ ఫాదర్‌. ఆయన తీసిన ఫస్ట్‌ నాలుగు సినిమాలు కన్నడలో సిల్వర్‌ జూబ్లీలు ఆడాయి. నాకు ఆ నాలుగు సినిమాలు నచ్చాయి. వాటిలో కొన్ని తెలుగులోకి వచ్చాయి. ‘తాజ్‌ మహల్‌’ను తెలుగులో తీశారు. ‘ప్రేమ్‌ కహానీ’, ‘మైలారీ’, ఆ తర్వాత వచ్చిన తీసిన ‘ఛార్మినార్‌’ నాకు బాగా నచ్చి తెలుగులో ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’గా రీమేక్‌ చేశా. అదే సినిమాను ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌కి పంపిస్తే… జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ రొమాంటిక్‌ ఫిల్మ్‌ అవార్డు వచ్చింది. నాకు ఒక మంచి చిత్రాన్ని అందించాడని మాత్రమే కాదు… నాకిష్టమైన దర్శకుల్లో అతను ఒకడు. ఉపేంద్రగారితో ‘బ్రహ్మ’ అని పెద్ద కమర్షియల్‌ సినిమా తీశారు. ఇప్పుడు ‘ఐ లవ్‌ యు’ కూడా తెలుగులో పెద్ద విజయం సాధించాలని, కల్ట్‌ క్లాసిక్‌ కావాలని కోరుకుంటున్నా. ఇప్పటివరకూ చంద్రు టీనేజర్స్‌తో, యంగ్‌స్టర్స్‌తో లవ్‌ స్టోరీస్‌ తీశారు. కానీ, ఈ రోజుల్లో పెళ్లి తర్వాత ప్రేమ చచ్చిపోతుందని, దానికి నిదర్శనంగా పెళ్లి తర్వాత ప్రేమకథ ఎలా ఉంటుందని కొత్తగా చూపించబోతున్న చంద్రుకి కంగ్రాట్స్‌. ఉపేంద్రగారితో సినిమా తీయాలని ఎప్పటినుంచో నా మనసులో ఉంది. త్వరలో ఛాన్స్‌ వస్తే తీస్తా. ఆయన దర్శకత్వంలో ఆయన యాక్ట్‌ చేయాలి. అయితే… ఆయన డెరెక్షన్‌ నా ఫెవరెట్‌ థింగ్‌. తెలుగులో పెద్ద స్టార్స్‌తో ఆయన సినిమా తీయాలని నా కోరిక. ఆయన థింకింగ్‌ ఇక్కడి వాళ్ళకు ఉండదు. ప్రజల పట్ల ఆయకున్న ఫీలింగ్స్‌ కూడా… ప్రజలే పాలించాల్సిన ప్రభుత్వాలు రావాలని కోరడం నాకు నచ్చింది. ఉపేంద్రగారిలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తులు రాజకీయాల్లో రాణిస్తారని నా నమ్మకం’’ అన్నారు. 

చిత్రదర్శకుడు ఆర్‌. చంద్రు మాట్లాడుతూ ‘‘తెలుగులో ఈ సినిమా విడుదలవుతుండటం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్‌ లగడపాటి శ్రీధర్‌గారికి నేను రుణపడి ఉంటాను. నేను తీసిన ‘చార్మినార్‌’ చూసి ‘నువ్వు తెలుగులో ఒక సినిమా తీయాలి’ అని, నా కథపై అభిమానంతో ఆయన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ నిర్మించారు. తెలుగుకు నన్ను పరిచయం చేశారు. ‘ఐ లవ్‌ యు’ నా కెరీర్‌లో 11వ సినిమా. నా ప్రొడక్షన్‌లో 4వ సినిమా. ఇండియాలో టాప్‌ టెన్‌ దర్శకుల్లో ఉపేంద్రసార్‌ ఉంటారు. శంకర్‌గారు చెప్పిన మాట ఇది. అటువంటి గొప్ప దర్శకుణ్ణి రెండోసారి దర్శకత్వం వహించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఉపేంద్రగారు హీరోగా నేను చేసిన తొలి సినిమా ‘బ్రహ్మ’ కన్నడలో బ్లాక్‌బస్టర్‌. ఇది రెండో సినిమా. ఒకసారి నేను టీవీ చూస్తున్నా. ‘ఆర్‌.ఎక్స్‌ 100’ బ్లాక్‌ బస్టర్‌. ఉపేంద్రగారి సినిమాలు చూసి అటువంటి ఐడియాతో సినిమా చేయాలని చేశామని చెప్పారు. ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌.ఎక్స్‌ 100’తో ట్రెండ్‌ మారింది. అటువంటి సినిమాలు ఉపేంద్రగారు ఎప్పుడో తీశారు. ఆయన్ను అందరూ ఇప్పుడు ఫాలో అవుతున్నారు. నాకు అటువంటి లైన్‌ ఒకటి ఐడియా వచ్చింది. అవకాశం ఇస్తారా? అని ఆయన దగ్గరకు వెళ్ళా. ‘లవ్‌ అండ్‌ సెక్స్‌… అంటే ఎరోటిక్‌ కాదు. రొమాంటిక్‌’ అనే లైన్‌తో ఈ ట్రెండ్‌కి తగ్గట్టు సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆయన దగ్గరకు వెళ్ళా. ఆయన కథ విని, ‘ఇది ఒక గీతాంజలి అవుతుంది’ అన్నారు. లవ్‌, సెక్స్‌ మధ్య వ్యత్యాసాన్ని ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు చెప్పాం. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. జీవితంలో ‘ఐ లవ్‌ యు’ ఎవరికి చెప్పాలి? మనం ఎవరికి చెబుతున్నాం? అనే థీమ్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఉపేంద్రగారి స్టైల్‌లో చెబుతున్నాం’’ అన్నారు.

వైవీయస్‌ చౌదరి మాట్లాడుతూ ‘‘ఈ ‘ఐ లవ్‌ యు’ టైటిల్‌ చాలాసార్లు విన్న టైటిల్‌లా ఉంటుంది. కానీ, ఆ లోగోలో ఒక క్రియేటివ్‌ స్టాంప్‌ ఉంది అనే ఫీలింగ్‌ కలుగుతుంది. దానికి కారణం చంద్రు. సిరీస్‌ ఆఫ్‌ సినిమాల ద్వారా లవ్‌ స్టోరీస్‌లో హ్యూమన్‌ వేల్యూస్‌, సెన్సిటివ్‌ వేల్యూస్‌ చూపించాడు. సున్నితమైన మలుపులతో కూడిన డ్రామా నడుపుతూ కన్నడ, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఉపేంద్రగారిది, చంద్రుది విచిత్రమైన బ్లెండింగ్‌ కాంబినేషన్‌. ప్రతి మనిషికి అంతర్గతం, బహిర్గతం ఉంటుంది. ఉపేంద్రగారి సినిమాల్లో హీరో క్యారెక్టర్‌కి బహిర్గతమే ఉంటుంది. లోపల ఏం ఉండదు. మనసులో భావాలను కుండబద్దలుగొట్టినట్టు హీరో మాట్లాడుతుంటాడు. ఆయన ఇమేజ్‌ని దృష్టిలో చంద్రు ‘ననే… ప్రేమించు’, నీకు నో ఛాయిస్‌ అని క్యాప్షన్‌ పెట్టి ఉంటాడు. ‘అర్జున్‌రెడ్డి’, ‘ఆర్‌ఎక్స్‌ 100’కి తాత ముత్తాత లాంటి సినిమాలను ఉపేంద్రగారు ఎప్పుడో తీశారు. ‘ఏ’, ‘ఓం’, ‘ఉపేంద్ర’ సినిమాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుండేది. హీరోకి ఒక క్యారెక్టరైజషన్‌ ఇచ్చి దాన్ని స్ట్రాంగ్‌గా ఫాలో అయ్యే దర్శకుల్లో పూరి జగన్నాథ్‌ ఒకడు. తను కన్నడలో ‘ఇడియట్‌’ తీసిన సమయంలో ఉపేంద్రగారి సినిమాలు తప్పకుండా చూసి ఉంటాడు. ‘ఇడియట్‌’కి ముందు పూరి సినిమాలు వేరు… ‘ఇడియట్‌’ తర్వాత వేరు. ఉపేంద్ర, పూరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. నేను కో డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఉపేంద్రగారితో పనిచేసే అదృష్టం కలిగింది. నేను వైజయంతి మూవీస్‌లో పని చేస్తున్నప్పుడు చిరంజీవిగారి సినిమాకు దర్శకత్వం వహించమని ఆయన్ను పిలిపించారు. ఒక బ్యాచ్‌తో వచ్చారు. అప్పటివరకూ చేస్తున్న కథలను పక్కన పెట్టి… వేరే జానర్‌లో సినిమా ఇలా ఉంటుందని ఊహించలేని విధంగా రూల్స్‌ని బ్రేక్‌ చేస్తూ కొత్త కథ చెప్పారు. అందరూ షాకయ్యారు. కమర్షియల్‌ పంథాలో కొత్త కోణంలో కథ చెప్పారు. ఆయన చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది. ఆయన సినిమాల్లో సోషల్‌ వేల్యూస్‌ ఉంటాయి. సమాజంలో కష్టనష్టాలను బ్లంట్‌గా చూపిస్తారు. నిజంగా ఆయనకు ఒక పార్టీ పెట్టే అర్హత ఉంది. ఇమేజ్‌ ఉంది. ఒకప్పుడు తెలుగులో ఆయన సినిమాలు బ్రహ్మాండంగా ఆడాయి. అప్పటిలా ఈ సినిమా హిట్‌ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. 

హీరో సుధాకర్‌ కోమాకుల మాట్లాడుతూ ‘‘నేను ఉపేంద్రగారికి పెద్ద అభిమానిని. ఆయన సినిమాలను ఎన్నోసార్లు చూశా. 12 ఏళ్ళ క్రితం నేను, నా ఫ్రెండ్‌ శివుడి దేవాలయాలపై చిన్న డాక్యుమెంటరీ చేశాం. బెంగళూరు వెళ్ళినప్పుడు ఉపేంద్రగారిని కలవాలని ఆయన ఇంటికి వెళ్ళాం.  ఆయన లండన్‌కి వెళ్ళారని చెప్పడంతో నిరాశగా వెనక్కి వచ్చేశాం. తర్వాత ఆయన హైదరాబాద్‌లో ‘టాస్‌’ షూటింగ్‌ చేస్తున్నారని తెలిసి సెట్‌కి వెళ్ళి కలిశాం. ఆయన చాలా బాగా రెస్పాండ్‌ అయ్యారు. అప్పటికీ, ఇప్పటికీ ఆయన అంతే హంబుల్‌గా ఉన్నారు. ఇటీవల ‘నువ్వు తోపురా’ టీజర్‌ చూసిన ‘ఐడల్‌బ్రెయున్‌’ జీవిగారు ఉపేంద్రగారి స్టైల్‌లో ఉందన్నారు. నా హెయిర్‌ స్టైల్‌ కూడా ఆయనలా ఉందన్నారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇండియాలో టాప్‌ టెన్‌ జెన్యూన్‌ పర్సన్స్‌ లిస్ట్‌లో ఉపేంద్రగారు ఉంటారు. ఆయన్ను కలవడానికి ఈ రోజు ఇక్కడికి వచ్చాను. ప్రేమ కథలు తీయడంలో స్పెషలిస్ట్‌ అయిన చంద్రుగారు ఈ సినిమా తీశారు. తప్పకుండా సినిమా సక్సెస్‌ అవుతుంది’’ అన్నారు. 

నటి సంజన మాట్లాడుతూ ‘‘సినిమా టీజర్‌ బావుంది. స్టార్టింగ్‌ సినిమాల్లో ఉపేంద్రగారు ఎంత చక్కగా, యంగ్‌గా ఉన్నారో… ఈ సినిమాలోనూ అంత అందంగా ఉన్నారు. ఈ సినిమా దర్శకుడు ఆర్‌. చంద్రు నాకు గురువు. ఇక్కడ తెలుగులో పూరి జగన్నాథ్‌గారు ‘బుజ్జిగాడు’ సినిమాతో బ్రేక్‌ ఇచ్చారో… కన్నడలో అలా శివరాజ్‌కుమార్‌గారు నటించిన ‘మైలారి’ సినిమాతో ఆర్‌. చంద్రుగారు బ్రేక్‌ ఇచ్చారు. 

హైకోర్టు లాయర్‌ బాలాజీ మాట్లాడుతూ ‘‘భారతదేశ సినిమాల్లో ఉపేంద్రగారిది డిఫరెంట్‌ జానర్‌. చంద్రుతో మూడేళ్ళ నుంచి నాకు పరిచయం ఉంది. ఆయన సినిమాలు చూశా. టేకింగ్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. మంచి మెసేజ్‌తో తీస్తారు. ఈ సినిమా కథ రెండేళ్ళ కిత్రం విన్నా. ఇండస్ట్రీలో ఇటువంటి కథ, జానర్‌ టచ్‌ చేయలేదు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. సాధిస్తుందని నమ్ముతున్నా. నాకు ఎప్పటి నుంచో తెలుగులో మంచి సినిమా చేయాలని, తీస్తే జూనియర్‌ ఎన్టీఆర్‌తో తీయాలని ఉంది. ఆ సినిమా చేస్తే… తప్పకుండా ఆర్‌. చంద్రుతో చేస్తా. అదే విధంగా మల్టీస్టారర్‌ సినిమాలు చాలా చేశారు. ఆయన తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. 

సోను గౌడ, బ్రహ్మానందం, హోనవళ్ళి కృష్ణ, జై జగదీష్‌, పీడీ సతీష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి
పీఆర్వో: నాయుడు – ఫణి 
స్టంట్స్‌: గణేష్, వినోద్, డా. కే రవి వర్మ 
కాస్ట్యూమ్ డిజైనర్: అర్చన (ఉపేంద్ర), తేజస్విని (రచితా రామ్)
కాస్ట్యూమర్: గండశి నాగరాజ్
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మునీంద్ర కె. పుర
సినిమాటోగ్రఫీ: సుజ్ఞాన్‌
ఎడిటర్‌: దీపు ఎస్‌. కుమార్‌
లైన్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ సూర్య
ఆర్ట్‌ డైరెక్టర్‌: మోహన్‌ బి. కేరే 
కొరియోగ్రఫీ: చిన్ని ప్రకాష్‌, ధను, మోహన్‌
లిరిక్స్: డా చల్లా భాగ్యలక్ష్మి 
మ్యూజిక్‌ డైరెక్టర్‌: డా. కిరణ్‌ తోటంబైల్‌
రచన, నిర్మాణం, దర్శకత్వం: ఆర్‌. చంద్రు.

Related posts