telugu navyamedia
సినిమా వార్తలు

దెయ్యం పాత్రలో టాప్ లెస్ గా త్రిష ?

Trisha

తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా వెలిగిన హీరోయిన్ త్రిష ఆ తరువాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కు వెళ్లిపోయారు. అక్కడ కూడా వరుస అవకాశాలతో బిజీ అయ్యారు. వరుసగా స్టార్ హీరోలతో జతకడుతూ హిట్లను అందుకుంటోంది. ప్రస్తుతం త్రిష చేతిలో షూటింగ్ దశలో ఉన్న నాలుగు సినిమాలతో చాలా బిజీగా ఉంది. అందులో “పరంపదం విలయట్టూ” అనే సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో త్రిష దెయ్యం పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో త్రిష ఓ రేంజ్ లో అందాలను ఆరబోయనుందట.త్రిష ఈ సినిమాలో అర్ధనగ్నంగా కన్పించబోతోందట. అయితే మరికొందరు మాత్రం ఆ వార్తలను కొట్టిపారేస్తున్నారు. మేకప్ లో భాగంగా త్రిషకు స్కిన్ కలర్ మేకప్ వేశారని అంటున్నారు. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే సినిమా విడుదలయ్యేదాకా ఆగాల్సిందే.

Related posts