telugu navyamedia
telugu cinema news

శశిలలిత : 78 రోజులు హాస్పిటల్‌లో ఏం జరిగిందో చెప్తాను…

Sasilalitha

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, ఆమె స్నేహితురాలు శశికళ జీవితం ఆధారంగా “శశి లలిత” అనే టైటిల్ తో జయం మూవీస్ అధినేత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి కాజోల్, శశికళ పాత్రలో అమలాపాల్ నటించబోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మించనున్నట్టు కేతిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఈ విషయంపై మాట్లాడిన ఆయన “శశి లలిత” సినిమా ద్వారా ఆమెకు జరిగిన అన్యాయాన్ని చూపించబోతున్నామని, ఈ సినిమాలో యదార్థ సంఘటనలు తెరకెక్కించనున్నామని, 78 రోజులు హాస్పిటల్‌లో ఏం జరిగిందో చెప్పబోతున్నామని పేర్కొన్నారు. జయలలిత బాల్యం నుంచి చిత్ర పరిశ్రమ కు రావడం, శోభన్ బాబుతో ప్రేమ వ్యవహారం, ఇలా అన్ని అంశాలు కవర్ చేస్తామమని, రెండున్నర గంటల్లో జయలలిత జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు అన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నామని, వచ్చే ఏడాదిలో “శశి లలిత” సినిమాను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇక ఎలెక్షన్ కోడ్ వల్ల ఆగిపోయిన “లక్ష్మీస్ వీరగ్రంథం” సినిమాను జూన్ చివరి వారంలో విడుదల చేస్తామని తెలిపారు.

Related posts

ఏ్రప్రిల్ 26న  గీతా ఆర్ట్స్ ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్ ద్వారా విడుద‌ల‌వుతున్న `నువ్వు తోపురా`

ashok

డియర్ కామ్రేడ్ : “ఎటుపోనే…” వీడియో సాంగ్

vimala p

“బాహుబలి” స్టైల్ లో మలయాళ సాంగ్… వైరల్

vimala p