telugu navyamedia
telugu cinema news

త్వరలోనే “మన్మథుడు-2” ట్రైలర్

MAnmathudu-2

మ‌న్మ‌థుడు చిత్రానికి సీక్వెల్ గా నాగార్జున హీరోగా ప్ర‌స్తుతం చిల‌సౌ ఫేం రాహుల్ ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో “మ‌న్మ‌థుడు-2” చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ చిత్రంలో. రావు రమేశ్‌, లక్ష్మి, ఝాన్సీ, వెన్నెల కిశోర్‌, దేవదర్శిణి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మ‌నం ఎంట‌ర్‌ప్రైజ‌స్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌య్‌కామ్ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున స్వయంగా జెమిని కిర‌ణ్‌‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆర్‌ఎక్స్ 100 ఫేం చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ప‌ని చేస్తున్నారు. ఆగ‌స్ట్ 9న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. టీజ‌ర్లోని లిప్‌లాక్ స‌న్నివేశాల‌ను వ‌ల్ల‌ నాగ్ విమ‌ర్శ‌ల‌ను సైతం ఎదుర్కొన్నారు. ఇక ట్రైలర్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది అక్కినేని అభిమానుల్లో. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయడమే కాకుండా ఆడియో విడుదల వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం.

Related posts

అత్యాచారం తప్పదనప్పుడు దాన్ని ఎంజాయ్‌ చేయటమే… అమితాబ్ వ్యాఖ్యలు వైరల్

vimala p

నిర్మాతగా మారబోతున్న సమంత

vimala p

రానా స్టార్ కాదు… శ్రీయ కామెంట్స్

vimala p