telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

కరోనా వ్యాక్సిన్‌ పై రాంచరణ్‌ వైఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌కి విరుగుడుగా వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని మోడీ 10:30 కి వర్చువల్‌ విధానంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 3006 ప్రదేశాల్లో ఒకేసారి వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకాలు ఇస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభంమైంది. వర్చువల్‌ విధానంలో ప్రధాని మోడీ కరోనా టీకా ప్రక్రియను ప్రారంభించిన అనంతరం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ కలిసి ప్రారంభించారు. ఇదిలా ఉంటే నేడు కరోనా వ్యాక్సిన్ అందుకున్న వారిలో మెగా ఫ్యామిలీ కోడలు ఉపాసన తాతయ్య గారు కూడా ఉన్నారు. ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో నేడు కరోనా టీకాను అందుకున్నారు. దీనిపై ఉపాసన స్పందించారు. ‘మా వెనక ఉన్న గొప్ప శక్తి మా తాతగారు. పద్మ విభూషన్ డాక్టర్ సీ ప్రతాప్ రెడ్డి గారు నేడు కారోనా వ్యాక్సిన్ టీకాను వేయించుకున్నారు. మన దేశంలో కరోనా వ్యాక్సిన్ అందండం గర్వపడాల్సిన విషయం. కరోనా నుంచి మనల్ని కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతల’ని ఉపాసన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే దేశమంతటా ఈ రోజు నుంచి కరోనా వ్యాక్షిన్ అందించనున్నారు. ప్రతి రాష్ట్రానికి కావలసి సంఖ్యలో ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ డోస్‌లను పంపింది. నేటి నుంచి ప్రారంభం కానున్న కరోనా వ్యాక్సిన్ పంపీణీ విజయవంతం కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా భారత్‌లోనే తయారయిన టీకాలు ఎటువంటి సైడ్‌ఎఫెక్ట్స్ చూపించడం లేదని అంటున్నారు. మరి కొన్ని నెలల్లోనే దేశంలోని ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్స్‌న్ టీకాలు వేయనున్నారు.

Related posts