telugu navyamedia
సినిమా వార్తలు

మహిళలకు అనుకూల పరిస్థితులు : ఉపాసన

Ram-charan-with-Upasana

ఉమెన్స్ డే సందర్భంగా ప్రముఖ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓవైపు బిజినెస్ లో రాణిస్తూనే మరోవైపు భర్తకు తగ్గ భారీగా నడుచుకుంటోంది ఉపాసన. ప్రతి మగాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందనే విషయంపై మీరేమంటారు ? అనే ప్రశ్న ఎదురైంది ఉపాసనకు. ఈ ప్రశ్నకు స్పందిస్తూ దానికి సరైన ఉదాహరణగా తన అమ్మమ్మను చూపింది. ఆమె ధృడమైన మహిళ అని, ఆమె దగ్గర ఎన్నో విషయాలను నేర్చుకున్నానని తెలిపారు. ఇక భర్తను విజయవంతంగా నడిపించడంలో భార్య పాత్ర తప్పకుండా ఉంటుందని, కొన్నిసార్లు భర్త తప్పులు చేస్తారని, ఆ సమయంలో భార్యలు వాటిని సరిదిద్దాల్సి ఉంటుందని, మన భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని, మన సమాజంలో మహిళలకు ఎంతో గౌరవం ఉందని చెప్పుకొచ్చారు.

ఇక మహిళల విషయంలో సమాజంలో ఏమైనా మార్పులు రావాలా ? అని ప్రశ్నించగా… ప్రస్తుతం మహిళలు తమకు కావాల్సింది సాధించుకునే సానుకూల పరిస్థితులు ఉన్నాయని, కాబట్టి అలాంటి అవసరం లేదనేది తన అభిప్రాయమని ఉపాసన అన్నారు.

Related posts