telugu navyamedia
telugu cinema news trending

జిమ్ లో టెన్నిస్ స్టార్ తో కలిసి ఉపాసన… ఫోటో వైరల్

Upasana

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ఆరోగ్యం దగ్గరి నుంచి, తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు, భర్త రామ్‌చరణ్‌కు సంబంధించిన విషయాలు.. సినీ విశేషాలు చెబుతూ అభిమానులకు టచ్‌లో ఉంటారు. యోగా, హెల్త్ టిప్స్ చెబుతూ ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో చెబుతారు. ఫిట్‌నెస్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా ఉంటారు. అపోలో లైఫ్ సంస్థ అధినేతగా ఉన్న ఆమె.. యూట్యూబ్ వేదికగా ఫిట్‌నెస్ సలహాలు ఇస్తూ ఫేమస్ అయ్యారు. అలా లక్షలాది ఫాలోయర్లను సంపాదించుకున్నారు. కాగా ఉపాసన, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఒకే జిమ్‌లో ఫిట్‌నెస్ కోచ్ పర్యవేక్షణలో కసరత్తులు చేస్తుంటారు. సానియాతో కలిసి తను వ్యాయామం చేస్తున్న ఫొటోలను గతంలో కూడా ఉపాసన షేర్ చేశారు. తాజాగా సానియా జన్మదినోత్సవం సందర్భంగా ఉపాసన మరో ఫొటోను షేర్ చేశారు. జిమ్‌లో సానియాతో కలిసి వ్యాయామం చేస్తున్న ఫోటోను షేర్ చేసిన ఉపాసన.. `హ్యాపీహ్యాపీ బర్త్‌డే సానియా. నా ఫిట్‌నెస్ ఇన్‌స్పిరేషన్. వ్యాయామం విషయంలో నాకు స్ఫూర్తి కలిగించినందుకు ధన్యవాదాలు. ఈ రోజు నిన్ను మిస్సవుతున్నా. మళ్లీ త్వరలోనే జిమ్‌లో కలుసుకుందాం` అని ఉపాసన ట్వీట్ చేశారు.

Related posts

అమ్మా … ఏమైనా ఉంటె, కాల్ చెయ్.. ట్వీట్ చేయకు అంటున్న నటి రష్మిక ..

vimala p

మావాళ్లకి వేసిన శిక్షే .. అత్యాచారాలు చేసి జైళ్లలో ఉన్నవారికీ వేయాలి.. : దిశ నిందితుల కుటుంబాల డిమాండ్ ..

vimala p

యువతి సజీవదహనంపై .. బంగ్లా కోర్టు సంచలన తీర్పు.. 16మందికి మరణశిక్ష..

vimala p