telugu navyamedia
ఆరోగ్యం

పిల్లలకు వ్యాక్సింగ్ ద్వారా అవాంఛిత రోమాలను తొలగించడం సురక్షితమేనా ?

Unwanted-Hair-removal

మా అమ్మాయి వయసు 9 సంవత్సరాలు. తన చేతుల పైన, కాళ్ళపైన అవాంచిత రోమాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నేను వ్యాక్సింగ్ చేసుకోవడము చూసి తనూ అలాగే చేయాలంటుంది. ఈ వయసులో పిల్లలకు వాక్సింగ్చేయడం సురక్షితమేనా ?

చేతులపై, కాళ్ళపై అలా వెంట్రుకలు రావడము హార్మోనుల ఇబ్బందులకు గాని, ఒవేరియన్‌ సిస్ట్ వంటి రుగ్మతలకు గాని సూచనకావచ్చు. మీ పాప అధిక బరువు వుంటే ఈ సమస్య ఉండే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ విషయం గురించి పిల్లల వైద్యులను సంప్రదించండి. అవసరమైతే హార్మోనుల పరీక్షలు, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించండి. అన్ని రిపోర్టులు నార్మల్ గా వస్తే వాక్సింగ్ చేయవచ్చును. అయితే వాక్సింగ్ నొప్పితోకూడినదన్న విషయాన్ని మీ పాపకు ముందుగానే తెలియజేయండి. వాక్సింగ్ కంటే ” ప్యూమిక్ స్టోన్‌” రుద్దడము, నలుగు పెట్టడము వంటి సంప్రదాయ పద్దతులను పాటించడం ఉత్తమం.

Related posts