telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

సంక్రాంతి కోడి పందాలతో .. కోట్లు చేతులు మారాయి.. అధికారులూ..

sankranthi celebrations in ap

పండగ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కోడి పందాలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని పోలీసులు హెచ్చరించినా, ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. గడచిన రెండు రోజుల్లో భీమవరం, ఉండి, ఏలూరు, నరసాపురం, కాకినాడ, పిఠాపురం, ఆకివీడు తదితర ప్రాంతాల్లో జరిగిన పందాల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి.

ఇక్కడ కోడి పందాలు కాసేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి కూడా పందెం రాయుళ్లు వచ్చి మకాం వేశారు. ఇక భీమవరం సమీపంలో ఏర్పాటు చేసిన పందెం బరులకు సంబంధించిన ఏరియల్ వ్యూ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని ఎవరో డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టు ఫొటోను చూస్తేనే అర్థమవుతుంది. యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కుంభమేళా, వైభవంగా ప్రారంభమైన వేళ, ఈ ఫొటోకు ‘కోడి కుంభమేళా’ అని ట్యాగ్ కూడా తగిలించారు.

Related posts