telugu navyamedia
సినిమా వార్తలు

శోభన్ బాబు సినిమాలు మానేశాక ఏం చేసేవారు ?

Sobhan-babu

ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు వారి మదిలో నిలిచిపోయి…“సోగ్గాడు”గా ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నట భూషణుడు శోభన్ బాబు. అమితంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు సినిమా కథానాయకుడు శోభన్ బాబు గురించి చాలామందికి తెలియని విషయాలను నవ్యమీడియా వేదికగా పాఠకుల కోసం అందిస్తున్నాము. శోభన్ బాబు సినిమాలు మానేశాక ఏం చేసేవారో తెలుసుకుందాము.

శోభన్ బాబుకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. సినిమాలు మానేశాక ఆయన రోజూ సాయంత్రం 5 గంటలకు తన కారును డ్రైవ్ చేసుకుంటూ చెన్నై వీధుల్లోకి వెళ్లేవారు. సిటీలో ఉన్న తన బిల్డింగులన్నీ వరుసగా చూసుకుంటూ గడిపేవారు. చెన్నైలో శోభన్ బాబుకు సంబంధించిన 50 పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి. రోజుకు కొన్ని చొప్పున వారంలో అన్నీ చూసుకోవడం ఆయనకు అలవాటు. మొదట్లో శోభన్ బాబుతో జయరామిరెడ్డి ఉండేవారు. ఆరోగ్యం సహకరించక ఆయన శ్రీకాళహస్తి వెళ్లిపోయారు. ఆ తరువాత శోభన్ బాబుతో ఆయన మేనేజర్ ఎస్.ఎన్. రావు లేదా ఏచూరి చలపతిరావు ఇలా ఎవరో ఒకరు ఉండేవారు. వారిలో ఎవరినో ఒకరిని వెంటబెట్టుకొని వెళ్లడం శోభన్ బాబుకు అలవాటు.

అన్నా నగర్, స్టెర్లింగ్ రోడ్, స్పర్ టాంక్ రోడ్డు, రాధాకృష్ణ సాలై, ఈస్ట్ కోస్ట్ రోడ్, బసంత్ నగర్… ఇలా ఎక్కడెక్కడ ఏయే బిల్డింగులున్నాయో వాటన్నింటినీ కళ్లారా చూసుకోవడం శోభన్ బాబుకు అలవాటు. రాత్రి ఎనిమిది వరకు అదే కాలక్షేపం. ఆ తరువాత ఆయనకు చాలా ఇష్టమైన స్టెర్లింగ్ రోడ్ లోని లయోలా కాలేజీ ఎదురుగా ఉన్న స్టేటస్ కో బిల్డింగ్ పై అంతస్థులో కూర్చునేవారు. పైనంతా ఆకాశంలో చిక్కనైన నల్లటి చీకటిలో నక్షత్రాలు… విద్యుద్దీపాల వెలుతురులో అందమైన చెన్నై నగరం… ఆ సమయంలో శోభన్ బాబు పక్కన ఏచూరినో… లేదా ఎస్.ఎన్. రావు… మరొకరో… ఎవరో ఒకరు… ఆ చీకట్లో అందమైన చందమామను చూస్తూ చందమామపై పాటలు పాడుకోవడం అంటే శోభన్ బాబుకు చెప్పలేనంత ఇష్టం.

ఇంకా శోభన్ బాబుకు పువ్వులు, చెట్లు అంటే మరింత ఇష్టం. అందుకే ఆ బిల్డింగ్ పైన ఎన్నెన్నో మొక్కలు, పూలు… వాటిమధ్య వీసీడీ ప్లేయర్ లో “మల్లీశ్వరి లేదా ముత్యాల ముగ్గు పాటలనో వేసుకుని వింటూ ఉండేవారు. మల్లీశ్వరి సినిమాలోని “అవిగో… అవిగో… నల్లని మబ్బులు గుంపులు గుంపులు…” అన్న చరణాన్ని ఉండిపోయేవారు చాలాసేపు. ఇక ముత్యాల ముగ్గులో “ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ…” అనే పాట వింటే ఆయన మనసంతా సంతోషంతో నిండిపోయేది. అంతటి ఏకాంతంలో ఇలాంటి మధురానుభూతి కోసమే శోభన్ బాబు ప్రైవేట్ పర్సన్ గా బ్రతకడానికి ఇష్టపడేవారు.

ఇవి కూడా చదవండి

శోభన్ బాబు 40 సంవత్సరాల కాఫీ తాగే అలవాటును ఎందుకు మానుకున్నారంటే ?

శోభన్ బాబు సభలకు, సమావేశాలకు వెళ్లేవారు కాదు… ఎందుకంటే…?

శోభన్ బాబుతో జయలలిత మొదటి పరిచయం

జయలలితతో శోభన్ బాబు డిన్నర్…

అప్పట్లో రెండొందల కోసం శోభన్ బాబు ఎంత కష్టపడ్డారో తెలుసా ?

హీరోనవుతానన్న శోభన్ బాబు… ఆయన తాతగారు ఏమన్నారంటే…?

ఆంధ్రా అందగాడు, సోగ్గాడు “శోభన్ బాబు” రికార్డులు

సోగ్గాడు శోభన్ బాబు ఒక్కసారి కూడా గుడికి వెళ్ళలేదు… ఎందుకంటే…!?

శోభన్ బాబు పర్సనల్ ఛాంబర్ లోని సీక్రెట్స్ ఇవే

Related posts