telugu navyamedia
రాజకీయ వార్తలు

జమ్ముకశ్మీర్‌ మాజీ ఎమ్మెల్యే రషీద్ అరెస్ట్

rasheed arrest

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత లోయలోని ఉగ్రవాదులను ఎరివేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇటీవల 70 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులను శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమానంలో ఆగ్రా జైలుకు తరలించారు. మరోవైపు ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేస్తున్నవారి పై పోలీసులు నిఘా పెట్టారు.

ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్న జమ్ముకశ్మీర్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యేను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే రషీద్ ఇంజినీర్‌ ఉగ్రవాదులకు ఆర్థికంగా సాయపడుతున్నట్టు ఆరోపణలు రావడంతో ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. 2017లో ఓసారి ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలిపెట్టింది. తాజాగా ఆయనను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపింది.

Related posts