telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విభజన చట్టంలోని అంశాలను ప్రస్తావించలేదు: టీఆర్ఎస్ ఎంపీలు

eone mlc nomination from trs on last day

కేంద్ర బడ్జెట్ పై టీఆర్ఎస్ ఎంపీలు పెదవి విరిచారు. తెలంగాణ కోరుతున్న అంశాలను బడ్జెట్లో పట్టించుకోలేదని, విభజన చట్టం అంశాల ప్రస్తావన లేదని ఎంపీ నామా నాగేశ్వరరావు తప్పుబట్టారు. ట్రైబల్ మ్యూజియాన్ని పట్టించుకోలేదని, ఆర్థిక వ్యవస్థను మెరిగుపరిచేలా బడ్జెట్‌ లేదని విమర్శించారు.

తెలంగాణ జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్ ప్రస్తావించలేదని, రైతులకు, నీటి ప్రాజెక్ట్ లకు ఈ బడ్జెట్ అనుకూలంగా లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించకపోవడం సబబు కాదని అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోలేదని నామా నాగేశ్వరరావు ఆరోపించారు.

Related posts