telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు విద్యా వార్తలు సామాజిక

ఇంగ్లీష్-వింగ్లిష్ .. రియాలిటీ .. చూసి స్ఫూర్తి పోందండోయ్..

uneducated women english speech

బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశానికి ఇచ్చిపోయిన ఆస్తి ఆంగ్లభాష. అప్పటినుండి మనవాళ్ళు దానిని పట్టుకోడానికి కష్టపడుతూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చదువుకునే వారిలో చాలా మందికి లెక్కలంటే యెంత భయమో.. భారతీయులకు ఆంగ్లమంటే అంతే భయం అని చెప్పాలి. భయం అనికూడా వాడకూడదేమో.. తప్పులు దొర్లుతాయేమో అని సిగ్గు. కానీ, అసలు చదువురాని వారు ఎందరో ఆయా పదవులలో లేదా సహజంగా ఎక్కడైనా తారసపడ్డప్పుడు వాళ్ళు మాట్లాడే లేదా వాడే ఆంగ్లపదాలు వింటుంటే, అనుకోకుండానే మనకు స్ఫూర్తి గా అనిపిస్తుంది. అయితే అదంతా అక్కడివరకే, దానిని మనం మాట్లాడటం నేర్చుకునే వరకు కొనసాగించం, అందుకే ఆంగ్లం అనగానే భయం లేదా సిగ్గు లేదా మరొకటి. ఏదైతేనేమి, మాట్లాడటానికి వెనుకడుగు అయితే వేస్తూనే ఉన్నాం.. అదే ఒక్క అడుగు ముందుకు వేస్తూ, ప్రతిసారి అడుగు వేసేముందు, స్ఫూర్తినిచ్చే వారిని తలుచుకుంటుంటే.. ఈ బాష నేర్చుకోవడం ఎంత సులభమో అర్ధం అవుతుంది. మీకోసం మరో స్ఫూర్తినిచ్చే .. ఇంగ్లీష్-వింగ్లిష్ వీడియో.

ఈ వీడియో లో ఆమె చదువుకున్నది లేదు, అయినా ఎంత కాన్ఫిడెంట్ గా ఆంగ్లంలో మాట్లాడుతుందో చూడండి. ఆమె మాట్లాడుతుంటే తప్పులు దొర్లుతున్నాయని ఆమెకు తెలియకపోయినా, మీకు తెలుస్తున్నాయి కదా.. అలా తప్పులు పట్టడం మానేసి, ఆమెలా మాట్లాడటం ప్రారంభించండి. అసలు ఆమె మాట్లాడుతుంటే, ఏ ఇంగ్లీష్ విమెన్ మాట్లాడుతుందో అన్నట్టే ఉంది కదా.. అదే కాంఫిడెన్స్ ఒక్క నెల నిలబెట్టుకొని.. మాట్లాడించుదండి.. ఆంగ్లం మీద మీకు బ్రిటిష్ వారికంటే చక్కగా పట్టు వచ్చేస్తుంది. ఏది ఏమైనా, ఆమె ఆంగ్లంలో మాట్లాడుతుంటే సూపర్ కదా.. ఆమెను అభినందించి, మీ మొదటి అడుగు వేసినట్టే. నేర్చుకోవడమే జీవితం, ఆమె జీవిత పాఠాలే నేటి ఆమె. అందరు అంతే. బుక్ ఇచ్చేది తరగతి పాఠాలే, జీవితమే అన్ని నేర్పిస్తుంది.. !

వీడియో ఇక్కడ చూడండి.

Related posts