telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

జగన్ చేతిలోకి .. ఉండవల్లి ..

Ex MP Undavalli comments special status

వైసీపీ లో మాజీ పార్లమెంటు సభ్యుడు ఏపీ రాజకీయాల్లో సీనియర్ ఉండవల్లి అరుణ్ కుమార్ చేరబోతున్నారా? జగన్ ఉండవల్లి అరుణ్ కుమార్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారా ? అంటే అవును అని చెప్తున్నారు వైసీపీ వర్గాలు . వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేరే అవకాశాలున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. చాలా కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ , రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో రాజకీయ పార్టీలు ఎవరు ఏ తప్పు చేసినా నిర్మొహమాటంగా చెప్పిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్. తమ పార్టీ అధికారంలోకి వస్తే తన మంత్రివర్గంలో చేరాలని జగన్ ఉండవల్లిని ఆహ్వానించినట్లు చెబుతున్నారు . పార్టీ లో ఉండవల్లి వంటి సీనియర్ నాయకుల అవసరం వుందని జగన్ అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. జగన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ కు ఉండవల్లి సూత్రప్రాయంగా అంగీరించినట్లు సమాచారం. ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడనే విషయం అందరికీ తెలిసిందే.

రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో ఉండవల్లి అత్యంత చాకచాక్యంగా వ్యవహరించే వ్యక్తి . విషయ పరిజ్ఞానం ఉన్న నేత అని భావించిరాష్ట్రాభివృద్ధి కోసం సీనియర్ మేధావుల అవసరం చాలా ఉందని అందుకే తనతో చేతులు కలపాలని జగన్ ఉండవల్లిని కోరినట్టు చెప్తున్నారు. ఎన్నికల ఫలితాలలో వైసీపీ అధికారంలోకి వస్తేబలమైన ప్రతిపక్ష నేతగా ఉంటే చంద్రబాబును ధీటుగా ఎదుర్కోవాలంటే ఉండవల్లి వంటి సీనియర్ల అవసరం ఎంతో ఉందని జగన్ భావిస్తున్నారు. అందుకే ఆయన ఉండవల్లికి బంపర్ ఆఫర్ ఇచ్చారు . జగన్ ఆహ్వానాన్ని ఉండవల్లి మన్నించినట్లు ప్రచారం కూడా సాగుతోంది. ఏది ఏమైనా ఉండవల్లి జగన్ పార్టీలోకి వస్తారా లేదా అనేది ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

Related posts