telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

కూతురిని కొడుతున్నాడని.. అల్లుడిని కొట్టి చంపిన మామ

కాళ్లుకడిగి కన్యాదానం చేసిన తమ కూతురిని అల్లుడు కొడుతున్నాడని ఓ మామ అల్లుడిని కొట్టి చంపిన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. చల్లపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలోని మంగళాపురం గ్రామానికి చెందిన సాల మురళీకృష్ణ(26) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మురళీకృష్ణ స్వగ్రామం అవనిగడ్డ కాగా, గత కొన్నేళ్లుగా మంగళాపురంలో మామ ఇంటిలోనే ఉంటున్నాడు. బుధవారం సోదరి ఇంటిలో ఫంక్షన్‌కు భార్య నాగమణితో కలిసి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేశారు.

రాత్రి 10 గంటల సమయంలో భార్యాభర్తల నడుమ గొడవ జరుగుతుండగా, కుమార్తెను అల్లుడు కొడుతున్నాడని గ్రహించిన మామ కూతాడి వెంకటేశ్వరరావు జోక్యం చేసుకున్నాడు. నా కూతురిని కొడతావా అంటూ ఆగ్రహంతో అల్లుడు ముర ళీకృష్ణ పై కర్రతో తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మచిలీపట్నం ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించటంతో గురువారం విజయవాడ రిఫర్‌ చేశారు. మధ్యాహ్నం ముర ళీకృష్ణను విజయవాడ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

Related posts