• Home
  • వార్తలు
  • స్వయంగా అమ్మవారే భక్తులకోసం ఇలా చేసిందట..! వీడియో వైరల్..
Trending Today వార్తలు సినిమా వార్తలు

స్వయంగా అమ్మవారే భక్తులకోసం ఇలా చేసిందట..! వీడియో వైరల్..

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని అమ్మవారి ఆలయంలో దసర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి… ఐదు రోజులుగా ఆత్మకూరు పట్టణంలోని జ్వాలాముఖి అమ్మవారి ఆలయానికి వేసిన తాళాలు, తలుపులు వేసినట్లుగానే ఉండగా, అర్ధరాత్రి సమయంలో ఓ మహిళ ఆలయం ప్రాంగణంలో ప్రదక్షిణలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి… కాగా ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. దుర్గాష్టమి రోజు రాత్రి నుంచి ఇలా జరుగుతుందని పలువురు చెబుతుండగా.. జ్వాలాముఖి అమ్మవారి ఆలయ పూజారి కృష్ణప్రసాద్ సైతం తనకు ఇలా శబ్ధాలు వినిపించాయని చెప్పడంతో..

Unbelievable Incident in Nellore Atmakur Jwalamukhi Temple

కొందరు యువకులు తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు…. కాగా ఓ మహిళ పసుపురంగు వస్త్రాలు ధరించి ముఖం కనిపించకుండా ఆలయ ప్రాంగణంలో అర్ధరాత్రి సమయంలో ప్రదిక్షణలు చేస్తున్న వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం పలు టీవీ జర్నలిస్టులు ఆలయానికి చేరుకుని భక్తుల అభిప్రాయాలను చిత్రీకరిస్తుండటం, స్వయంగా అమ్మవారే ప్రదిక్షణలు చేశారని వార్తలు రావడంతో భక్తులు భారీ ఎత్తున అక్కడకు వచ్చి జ్వాలాముఖి అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

 

vs mojotv

అమ్మవారే ప్రదక్షిణలు చేశారని భక్తులు చెబుతున్నారు. కాగా, అమ్మవారి పూనకం వచ్చిన ఓ మహిళ, తన భక్తుల కోసం తాను గుడిలో ప్రదిక్షణలు చేశానని, తన బిడ్డలకు తాను రక్షణగా ఉంటానని చెప్పారు. గ్రామదేవతలం తమ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత తమదేనని, ఎవరు ఏమనుకున్నా, తమ ప్రజల కోసమే గుడిలో ప్రదక్షిణలు చేశామని చెప్పారు… 

Related posts

జనవరిలో యూత్‌కింగ్‌ అఖిల్‌-వెంకీ అట్లూరి-బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ల ‘మిస్టర్‌ మజ్ను’… 

chandra sekkhar

విజయ్ దేవరకొండ సినిమాలు తగ్గిస్తాడట…!?

vimala t

దిల్ రాజును భయపెడుతున్న “అరవింద సమేత”

vimala t

Leave a Comment