telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నాలుగైదు నెలల్లో నిరుద్యోగ భృతి: కేసీఆర్

Un-employee allowance shortly telangana

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ భరోసా కల్పించారు. రాబోయే నాలుగైదు నెలల్లో నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. శాసనసభలో కేసీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి పథకం అమలు కోసం విధివిధానాలను అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా నిరుద్యోగుల వివరాలను సేకరిస్తున్నామన్నారు.

అభ్యర్థుల కటాఫ్ వయసు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియాలంటే లెక్క పక్కాగా ఉండాలి. నిరుద్యోగ భృతి విషయంలో తాము అబద్ధాలు చెప్పదలుచుకోలేదు. నాలుగు, ఐదు నెలల్లో నిరుద్యోగ భృతి పథకాన్ని అమల్లోకి తీసుకువస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇటీవల ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి పథకం అమలు కోసం రూ. 1,810 కోట్లు కేటాయించామని సీఎం కేసీఆర్ తెలిపారు.

Related posts