వార్తలు సామాజిక

పది గంటలు నీటిలో మృత్యువుతో పోరాడి… చివరకు

UK Woman fell down in sea 10 Hours Rescued

నీటిలో మునిగి5 నిముషాలకే ఊపిరి ఆగక కొట్టు మిట్టాడుతాం.. అలాంటిది సముద్రంలో కాలు జారి పడిపోయి ఏకంగా 10గంటలపాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సురక్షితంగా ప్రాణాలతో బయట పడిన ఈ సంఘటన ప్రస్తుతం ట్రెండ్ గా మారింది…

బ్రిటన్ కు చెందిన కేయ్ అనే మహిళ తన స్నేహితులతో కలిసి క్రొయేషియాకు చెందిన నార్వేజియన్ స్టార్ షిప్ లో ప్రయాణిస్తుంది… కాగా పడవ అంచున నిలబడి తన స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కాలు జారి సముద్రంలో పడిపోయింది.. దీనితో వెంటనే అప్రమత్తమైన కేయ్ స్నేహితులు తనను పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నించారు.. అయినా ఫలించలేదు.. దీనితో షిప్ లో ప్రయాణిస్తున్న మిగతా ప్రయాణికులు కేయ్ పడిపోవడాన్ని గమనించి వెంటనే కెప్టెన్ కు సమాచారం అందజేశారు.. దీనితో అప్రమత్తమైన కెప్టెన్…

vs TRT

క్రొయేషియా నేవి అధికారులకు సమాచారం అందజేశారు.. యువతి కాలు జారీ పడిపోయిన ప్రదేశం క్రొయేషియా తీరానికి సుమారు 60 మైళ్ళ దూరం ఉంటుంది.. అయితే పీసీ-9 విమానంతో గాలుల వేగం, అలల తీరును గమనిస్తూ సుమారు 10గంటల పాటు గాలించి చివరకు కేయ్ ను కనిపెట్టి రక్షించారు… అయితే అంతసేపు సముద్రపు అంచుల్లో ఉప్పు నీటిలో మునిగిపోయిన కేయ్ సురక్షితంగా ప్రాణాలతో బయట పడటంతో అందరు ఆశ్చర్యంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికి అక్కడి వారికీ అంతసేపు నీటిలో మునిగితే ప్రాణాలతో ఎలా బయట పడిందో అన్న విషయం అంతుచిక్కడం లేదు..

Related posts

ప్రారంభమైన వైసీపీ ఎంపీల ఆ'మరణ' దీక్ష

admin

తెలంగాణ ఓటర్ల జాబితాపై..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

madhu

వావ్ మృతదేహానికి 3రోజులు పరీక్షలు… 8లక్షలు టోకరా… చివరకు ఇలా

nagaraj chanti

Leave a Comment