telugu navyamedia
సామాజిక

ప్రయాణికురాలి డ్రెస్ పై విమాన సిబ్బంది అభ్యంతరం… ఆ యువతి ఏం చేసిందో చూడండి.

Emily

యూకేలోని బర్మింగ్ హామ్ నుంచి క్యానరీ ఐల్యాండ్స్‌ వెళుతోంది థామస్ కుక్ ఎయిర్‌లైన్స్ విమానం. అందులో ఎమిలీ కానరీ అనే ఓ యువతి ఎక్కింది. చెకింగ్ అప్పుడు ఎలాంటి ఇబ్బందినీ ఆమె ఎదుర్కోలేదు. కానీ విమానం ఎక్కిన తరువాత విమాన సిబ్బంది ఆమె డ్రెస్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె వేసుకున్న డ్రెస్‌ అభ్యంతరకరంగా ఉందని, పైన మరో టాప్ వేసుకోమని ఆ యువతికి సూచించారు. లేకపోతే విమానంలో నుంచి దించేస్తామని హెచ్చరించారు. పైగా ఫ్లైట్‌లో ఉన్న సహాయకులతో పాటు మేనేజర్ కూడా అదే మాట అన్నారు. దాంతో ఎమిలీకి కోపం నషాళానికంటింది. నాడ్రెస్ నా ఇష్టం… ఎలాంటి డ్రెస్ అయినా వేసుకుంటాను. అడగడానికి మీరెవరంటూ విమాన సిబ్బందిపై విరుచుకు సదరు యువతి. సిబ్బంది తనని ఇబ్బంది పెడుతున్న విషయాన్ని వివరిస్తూ వెంటనే వెంటనే ఎయిర్‌లైన్స్ అధికారులకు ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన ఎయిర్ లైన్స్ అధికారులు ఆమెకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పారు. మా సిబ్బంది ఇలాంటి సున్నితమైన సమస్యని మరింత సున్నితంగా హ్యాండిల్ చేసి ఉండవలసింది అంటూ ఎమిలీకి వివరణ ఇచ్చారు.

Related posts