telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆ వ్యాక్సిన్ వద్దు… ఇది తీసుకోండి అంటున్న బీసీసీఐ

కరోనా కారణంగా ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆటగాళ్లంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో తమ సొంత నగరాల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలని బీసీసీఐ ఆటగాళ్లకు సూచించింది. అయితే ఐపీఎల్ అర్దాంతరంగా ఆగిపోయిన నేపథ్యంలో టీమిండియా వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగే ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ భారత్ ఆడనుంది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిశాక దాదాపుగా నెల రోజుల సమయం ఉంటుంది. అప్పుడు ఐదు టెస్టుల కోసం కోహ్లీసేన సన్నద్ధం కానుంది. అయితే ఆటగాళ్లు తప్పనిసరి కోవిషీల్డ్ వేయించుకోవాలని ఆదేశించినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఎందుకంటే ఫస్ట్ డోస్ ఇక్కడ తీసుకొన్న ఆటగాళ్లు.. సెకండ్ డోస్ తీసుకునే సమయానికి ఇంగ్లండ్‌లో ఉంటారని తెలిపింది. అక్కడ కోవాగ్జిన్ దొరకదని, యూకే కంపెనీ తయారు చేసి కోవీషిల్డ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ఆటగాళ్లంతా కోవీషీల్డ్ వేయించుకోవాలని సూచించింది.

Related posts