telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

దుబాయ్ లో మరో భారీ నిర్మాణం.. రికార్డు బ్రేక్

Dubai-Frame

ఇప్పటికే బుర్జా ఖలీఫాతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణం కలిగిన దేశంగా దుబాయి రికార్డుకెక్కిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారీ నిర్మాణంతో గిన్నీస్ రికార్డు సొంతం చేసుకుంది ఈ అరబ్ దేశం. ‘ఫోటో ఫ్రేమ్’ ఆకారంలో నిర్మించిన ఈ భారీ భవనాన్ని అత్యంత సుందరగా తీర్చిదిద్దారు. దుబాయికే ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఈ బిల్డింగ్ నగరంలోని జబీల్ పార్కులో నిర్మించబడింది. 150.24 మీటర్ల ఎత్తు, 95.53 మీటర్ల వెడల్పుతో రూపుదిద్దుకున్న ఈ నిర్మాణం నుంచి దుబాయి సుందర దృశ్యాలు అత్యద్భుతంగా కనిపించేలా నిర్మించారట ఆర్కిటెక్స్. ఈ ఫోటో ఫ్రేమ్ భవనం సందర్శనకు సుమారు 14 డాలర్లు(సుమారు రూ.980) చార్జీ చేయనున్నారని తెలిసింది.

Related posts