telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

జపాన్ ప్రభుత్వంపై కేసు వేసిన అబ్బాయి… మరో అబ్బాయి కోసమట…!!

Japan

ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం, సహజీవనం చేయడం అనేది సర్వసాధారణంగా మారింది. కానీ ఎన్నో దేశాలలో ఇలాంటి వివాహాలకు అక్కడి చట్టాలు నో చెబుతుండటంతో ఇటువంటి వారందరూ ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. తాజాగా ఆండ్రూ హై అనే ఓ అమెరికన్ జపాన్ ప్రభుత్వంపై దావా వేశాడు. ఎందుకు వేశాడంటే.. ఆండ్రూ జపాన్‌కు చెందిన కొహే అనే వ్యక్తిని పెళ్లాడాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కొహేతో 15 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారడంతో 2015లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే కొహే జపాన్ వెళ్లిపోవడంతో ఆండ్రూ కూడా షార్ట్ టర్మ్ వీసాతో కొహేతో ఉంటున్నాడు. తాను కొహేకు భార్యనని తనకు లాంగ్ టర్మ్ వీసా కావాలంటూ ఆండ్రూ జపాన్ వీసా అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు. కానీ.. జపాన్ చట్టం ప్రకారం ఒకే జెండర్‌కు చెందిన వారు వివాహమాడడం నేరం కావడంతో ఆండ్రూకు ఐదు సార్లు వీసాను నిరాకరించింది. దీంతో ఆండ్రూ, కొహే జపాన్ ప్రభుత్వంపై లక్ష డాలర్ల దావా వేశారు. జపాన్ ప్రభుత్వం వాళ్ల హక్కులను కాలరాస్తోందని వారి తరపు లాయర్ సుజుకీ ఆరోపిస్తున్నారు. కొహే ఒకవేళ జపాన్‌ను వీడి అమెరికా వెళ్లినా జపాన్ ప్రభుత్వం తప్పే అవుతుందని ఆమె అన్నారు. కాగా, ఓ అధికారి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నట్టు తెలిపారు.

Related posts