telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కర్ణాటక-తమిళనాడు : .. మరో ఇద్దరు యువ నటులు.. రాజకీయాలలోకి…

two young actors into politics

నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాకపోయినా, ఏదో సినిమాలు తీసితీసి రిటైర్ అయ్యే ముందు వచ్చేవారు కొందరు, బాగా ఫేమ్ రాగానే వచ్చేవారు కొందరు.. మరీ సుడి తిరిగితే రాజకీయ వారసులుగా వస్తుంటారు. అదే దారిపట్టారు ఇద్దరు యువ సినీనటులు. సినిమాలు గిట్టటంలేదేమో వీరికి, రాజకీయాలపై దృష్టిపెట్టారు. యువనటుల్లో ఒకరు తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్ కాగా..మరొకరు కన్నడ యాక్టర్ నిఖిల్ కుమార స్వామి. దివంగత తమిళనాడు మాజీ సీఎం ఎం కరుణానిధి మనవడు, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆ పార్టీ యూత్ వింగ్ కార్యదర్శిగా నియమితులయ్యారు.

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి జేడీ(ఎస్) యూత్ వింగ్ అధ్యక్షుడిగా నియామకమయ్యారు. ఈ సందర్భంగా నిఖిల్ కుమారస్వామి మాట్లాడుతూ..మీ కుటుంబంలో రాజకీయ వారసత్వం కొనసాగుతుందని ప్రశ్నలు రావొచ్చని గతవారమే చెప్పాను. కానీ దేవెగౌడ జీ నన్ను యూత్ వింగ్ అధ్యక్షుడిగా నియమించడంతో కొంత షాక్‌కు గురయ్యా. దేవెగౌడ అభీష్టం, పిలుపుమేరకు ఆయన సారథ్యంలోని పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. నిఖిల్ మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

Related posts