telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య సినిమాలో ఇద్దరు విలన్లు…!

no more movies in near future by balakrishna

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నారని దర్శకుడు బోయపాటి క్లారిటీ ఇచ్చేశారు. ఒకటి అఘోరా పాత్ర కాగా.. మరొకటి ఫ్యాక్షనిస్ట్ రోల్. ఈ సినిమాలో ఇద్దరు విలన్లు ఉండబోతున్నారట. ఇప్పటికే ఓ పాత్రకు శ్రీకాంత్‌ను ఎంపిక చేయగా… మరొకరి కోసం చిత్రబృందం పరిశీలిస్తుంది. మరో ప్రధాన ప్రతినాయక పాత్ర కోసం ఓ బాలీవుడ్ నటుడిని తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా తొందర్లోనే ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్‌ను కూడా ప్రకటిస్తామని డైరెక్టర్ బోయపాటి శ్రీను చెప్పుకొచ్చారు. కాగా వారణాసిలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నామని, లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఈ చిత్రీకరణ ప్రారంభిస్తామని బోయపాటి తెలిపారు. కాగా బాలకృష్ణ శైలికి తగ్గట్టుగా ఓ శక్తిమంతమైన కథని సిద్ధం చేశారు దర్శకుడు బోయపాటి.

Related posts