telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

రెండు రాష్ట్రాలకు చల్లని కబురు.. ఉరుములతో కూడిన వర్షాలు

మండుటెండలతో ఉకీరిబిక్కిరి అవుతున్న రెండు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. కృష్ణగిరి, ఈరోడ్‌, నీలగిరి, కోయంబత్తూర్‌, తేని, దిండుగల్‌, తిరుప్పూర్‌, తిరుచ్చి, సేలం, నామక్కల్‌, కరూర్‌ తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని వారు తెలిపారు.

రాజధాని చెన్నైలో ఆకాశం మేఘావృత్తంగా ఉంటూ గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో గరిష్టంగా నీలగిరి జిల్లా కోతగిరిలో 4 సెం.మీ, కన్నియకుమారి జిల్లా పెరుంజాణిలో 3 సెం.మీ, కయత్తార్‌లో 2 సెం.మీ, శివగంగ జిల్లా మానామదురై, నీలగిరి జిల్లా ఊటీలో తలా 1 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు.

Related posts