telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రైళ్ల ప్రైవేటీకరణ లేదంటూనే .. రెండు రైళ్లు వారికే అంటగడుతున్న కేంద్రం..

two rails into private hands in capital

ఆదాయం పెంచుకోవాలనే నెపంతో తాజాగా రైల్వే శాఖలో కూడా ప్రైవేటీకరణ పై కేంద్రం గొంతు విప్పింది. అయితే ప్రైవేట్ వారికీ రైళ్లను ఇవ్వబోమని, ఆదాయం పెంచే ప్రయత్నాలు మాత్రమే అని సమాధానం ఇచ్చింది.. కేంద్రం. కానీ, రెండు రైళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయించింది. అందులో భాగంగా ఢిల్లీ – లక్నో మధ్య నడిచే తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రైవేటు సంస్థల అధీనంలోకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ రైలు ఆనంద్ నగర్ స్టేషన్ లో ఉండగా, త్వరలోనే బిడ్డింగ్ ప్రక్రియను పూర్తి చేసి, రైలును ఎవరికి కాంట్రాక్టుకు ఇవ్వాలన్న విషయాన్ని నిర్ణయిస్తారు. ఇక ఈ రైలులో ఎన్నో అద్భుతాలు ఉంటాయి.

ప్రైవేటీకరణ అంటే వారి ఆర్భాటానికి తక్కువయేమి ఉంటుంది.. ఈ రైళ్లలో .. ప్రతి సీటు వెనుకా ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది. ఇందులో ఇష్టమైన సినిమాలను, టీవీ కార్యక్రమాలను వీక్షించవచ్చు. దీంతో పాటు వైఫై, మొబైల్ చార్జింగ్ పాయింట్లుంటాయి. సీట్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని అధికారులు అంటున్నారు. ఈ సీట్లు రైలు రంగుకు మ్యాచ్ అయ్యేలా పసుపు, ఆరంజ్ రంగుల్లో ఉంటాయి. ప్రతి బోగీలో చిన్న పాంట్రీ, ఎల్ఈడీ లైట్లు, మాడ్యులర్ టాయిలెట్లు, మోటార్ ఆపరేటెడ్ కర్టెన్లతో కూడిన స్మార్ట్ విండోస్ ఉంటాయి.

Related posts