telugu navyamedia
సినిమా వార్తలు

“బిగ్ బాస్”లోకి మరో రెండు వైల్డ్ కార్డు ఎంట్రీస్

starmaa official on bigg boss 3 telugu

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ప్ర‌స్తుతం తెలుగు సీజ‌న్-3… నాగార్జున హోస్ట్‌గా 15మంది సెల‌బ్రిటీల‌తో జూన్ 21న మొద‌లైన ఈ కార్య‌క్ర‌మం విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారంలో హేమ ఎలిమినేట్ కాగా, రెండో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి ఇంట్లోకి ప్ర‌వేశించారు. గ‌త రెండు సీజ‌న్‌ల‌లో చేయ‌ని సాహాసాన్ని ఈ సారి సీజ‌న్ 3లో బిగ్ బాస్ నిర్వాహ‌కులు చేయ‌డం విశేషం. తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌రో రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా బిగ్ బాస్ సీజ‌న్ 3లో ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. “రేయ్” సినిమాలో జెన్నాగా పవర్‌పుల్ ప్రతినాయిక పాత్రలో నటించి తన ఇమేజ్ అమాంతం పెంచేసుకున్న‌ యంగ్ హీరోయిన్ శ్ర‌ద్దా దాస్ బిగ్ బాస్ ఎంట్రీ త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఈమెతో పాటు మ‌రో టాలీవుడ్ సెల‌బ్రిటీ కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ‌తారని చెప్పుకొస్తున్నారు. గ‌తంలో కాకుండా ఈ సారి బిగ్ బాస్ టీం ఇచ్చే స‌ర్‌ప్రైజ్ ఆడియ‌న్స్‌లో కార్యక్రమంపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Related posts