telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

దిశ నిందితులలో .. మైనర్లు ఉన్నారంటున్న… మానవహక్కువ సంఘం..

two minors in disa encounter said nhrc

దిశ ను హత్యాచారం చేసిన నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఈ కీచకుల్లో ఇద్దరు మైనర్లు అనే వివాదం తెరపైకి వస్తుంది. ఇదే కాకుండా పోలీసులు ఈ కేసు విచారణలో జువెనైల్‌ జస్టిస్‌ చట్టం ప్రకారం నిబంధనలను పాటించకుండానే వారిని ఎన్‌కౌంటర్‌ చేశారా ? అనే కొత్త విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు ఆరిఫ్‌ మినహా మిగిలిన ముగ్గురు నిందితుల వయసు దాదాపు 20 సంవత్సరాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. కానీ, నిందితుల్లో చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ మైనర్లని ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తోంది. తమ బిడ్డలు మైనర్లని వారి కుటుంబ సభ్యులు ఎన్‌హెచ్‌ఆర్సీకి స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు, వారి వయసు ధ్రువీకరణకు సంబంధించిన బోనఫైడ్‌ సర్టిఫికెట్లను కూడా సమర్పించినట్లు తెలుస్తోంది.

ఇక్కడొక విషయం ప్రస్తావించవలసిన అవసరం వచ్చింది. మైనర్లు చేసే పనేనా వారు చేసింది. పిల్లలు పిల్లల్లాగా ఉంటే ఇప్పుడు ప్రాణాలు పోయేవి కాదుగా ఇంట్లోకి పాము పిల్ల వస్తే కర్ర తీసుకుని చంపుతారా లేక పిల్ల పామని చేతపట్టుకుని దయతో వదిలేస్తారా? చేయరాని తప్పు చేసినప్పుడు దానికి తగిన విధంగా శిక్ష వేయడం న్యాయం అవుతుంది. వారు చేసింది చిన్న తప్పు కాదుగా ఎంత కౄరంగా ఒక మనిషి ప్రాణం తీసారంటే ఇది వారిలో ఉన్న నేర ప్రవృత్తికి నిదర్శనం. ఇలాంటి వాటిని చూసి చిన్న చిన్న శిక్షలతో సరి పెట్టుకుంటే సమాజంలో మరి కొంతమంది అలుసుగా తీసుకుని చెలరేగే అవకాశం ఉంది అంటు ప్రశ్నిస్తున్నారు ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు. దేహంలోని ఒక అవయవం పాడైతే వైద్యులు దాన్ని మాత్రమే చికిత్సచేసి అవసరమనుకుంటే తొలగిస్తారు. అలాగే మనిషి, మనసు కలుషితమైతే దాన్ని తొలగించాలి ఇది ధర్మబద్దమైన విషయం.. ఇప్పుడు చట్టం ఇదే చేసింది దానికి ఇన్ని రాద్ధాంతాలు ఎందుకంటూ కొందరు బాధ్యతగల పౌరులు ప్రశ్నిస్తున్నారు.. తప్పుచేయడం నేరం కానప్పుడు, తప్పు చేసిన వారిని శిక్షించడం కూడా తప్పుకాదు. మన పురాణాలు, గ్రంధాలు ఇదే న్యాయం అని చెబుతున్నాయి.

Related posts