telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ కోసం .. చితక్కొట్టుకున్న వ్యాపారవేత్త, ప్రభుత్వ అధికారి.. !

two men fight for a heroin in public

రాగిణీ ద్వివేది(కన్నడ హీరోయిన్) కోసం ఆమె ప్రస్తుత స్నేహితుడు, మాజీ స్నేహితుడు గొడవ పడి దారుణంగా కొట్టుకున్నారు. ఈ ఘటన బెంగళూరులో జరుగగా, సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి శివప్రకాశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. బనశంకరి ప్రాంతంలోని రిట్జ్ కార్టన్ హోటల్ లో ఈ ఘటన జరిగింది. రాగిణి, తన ప్రస్తుత స్నేహితుడు, ఆర్టీఓ అధికారిగా ఉన్న రవి అనే వ్యక్తితో కలిసి హోటల్ కు వెళ్లిన వేళ, అప్పటికే అక్కడ ఆమె మాజీ స్నేహితుడు, బిజినెస్ మేన్ శివ ప్రకాశ్ తన మిత్రులతో కలిసి పార్టీ చేసుకుంటున్నారు. రాగిణి, రవి రావడంతోనే తనను వదిలేసి, వేరే వారితో తిరుగుతున్నావా? అంటూ వాగ్వాదానికి దిగాడు.

two men fight for a heroin in publicఈ గొడవ శృతిమించడంతో, పక్కనే ఉన్న బీర్ బాటిల్ తీసుకుని రవిపై దాడి చేశాడు. హోటల్ సిబ్బంది వీరిని విడిపించి అక్కడి నుంచి పంపగా, రాగిణి, రవిలు అశోక్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివ ప్రకాశ్ ను అదుపులోకి తీసుకున్నామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. హోటల్ కు రాగిణి, రవి వెళుతున్న వేళ, రవి భార్య ఆయనకు ఫోన్ చేసి గొడవ పడ్డట్టు తెలుస్తోంది. రాగిణి కోసం తన జీవితాన్ని నాశనం చేశావని వాపోతూ, ఇప్పుడు ఆమెతో కలిసి ఎక్కడున్నావో, ఎక్కడికి పోతున్నావో తెలుసునని, ఎవరో ఒకరు వచ్చి నిన్ను చావగొడతారని శాపనార్థాలు పెట్టినట్టు సమాచారం. ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగిన కాసేపటికే రవిపై దాడి జరగడం గమనార్హం.

Related posts