telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనాపై ఊహాగానాలు నమ్మొద్దు: మంత్రి పుష్పశ్రీవాణి

pushpa sreevani

కరోనా వైరస్‌ పై ఏపీ ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తమైంది. వ్యాప్తి విషయంలో వస్తున్న ఊహాగానాలు, ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి సూచించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆమె ఓ మెసేజ్‌ ఉంచారు. వైద్య సిబ్బందికి అవసరమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.

ప్రభుత్వం అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోందని, మన బాధ్యతగా వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని పిలుపునిచ్చారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే తక్షణం వైద్యుడిని సంప్రదించాలని, దూరప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే 0866-2410978 నంబర్‌కు ఫోన్‌చేసి వైద్య సహాయం పొందాలని సూచించారు.

Related posts