telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ట్రంప్ దే కాదు ఆయన మద్దతుదారుల ఖాతాలను కూడా…?

డొనాల్డ్ ట్రంప్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి… అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపై న్యాయపోరాటం చేసినా ఆయనకు చేదుఅనుభవమే ఎదురుగా కాగా.. పార్లమెంట్‌పై దాడి చేసేలా తన అభిమానుల్ని ట్రంప్‌ రెచ్చగొట్టారన్న ఆరోపణలు ఇప్పుడు ఆయనను కుదిపేస్తున్నాయి.. ఓవైపు ట్రంప్‌ అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.. మరోవైపు ఇప్పటికే సోషల్ మీడియా సంస్థలన్నీ ట్రంప్‌కు సంబంధించిన ఖాతాలను నిలిపివేశాయి.. తాజాగా.. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ ఊహించని విధంగా.. ఆయనకు అనుకూలంగా ఉన్న 70 వేల ఖాతాలను కూడా బ్లాక్ చేసింది షాక్‌ ఇచ్చింది ట్విట్టర్.  వాషింగ్టన్‌లోని కేపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి, విధ్వంసం తర్వాత.. ఈ దాడులను ప్రోత్సహిస్తూ హింసను ప్రేరేపించే విధంగా ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్టులు ఉండడంతో.. గత శుక్రవారం ఆయన వ్యక్తిగత ఖాతాను మొదట 12 గంటల పాటు నిలిపివేసిన ట్విట్టర్.. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్రంప్ ఖాతాను శాశ్వతంగా బ్యాన్ చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది.. అంతటితో సోషల్ మీడియాలో ట్రంప్ అలజడి ఆగలేదు.. ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఇది, మరే ప్రమాదానికి దారితీస్తోందని అలర్ట్ అయిన ట్విట్టర్.. ట్రంప్‌కు అనుకూలంగా ఉన్న సుమారు 70 వేల ఖాతాలను కూడా నిలిపివేస్తూ సంచలన ప్రకటన చేసింది.

Related posts