telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

వికారాబాద్ అడవుల్లో కాల్పుల ఘటనలో కొత్త కోణం

వికారాబాద్ అడవుల్లో కాల్పుల ఘటనలో కొత్త కోణం బయటపడింది. దామగుండంలో ఓ ప్రముఖ క్రీడాకారిణికి, ఆమె బంధువులకు ఫామ్ హౌజ్ లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఫాం హౌజ్ కు వస్తున్న వారే కాల్పులు జరుపుతున్నారని స్ధానికులు ఆరోపణ చేస్తున్నారు. దీంతో ఫామ్ హౌజ్ నిర్వాహకులు, సిబ్బందిని పోలీసులు విచారించారు. స్థానికులను బెదిరిస్తున్న ఫామ్ హౌజ్ నిర్వాహకులు.. ఫామ్ హౌజ్ దరిదాపుల్లోకి పశువులు తీసుకొని రావద్దు అంటూ స్థానికులను బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాల్పుల ఘటన పై కీలక సమాచారం సేకరించిన పోలీసులు… స్వాధీనం చేసుకున్న బుల్లెట్ ఏ రివాల్వర్ నుంచి వచ్చిందోనని దర్యాప్తు చేస్తున్నారు. ఆవు యజమానిని ఘటన జరిగిన మరుసటి రోజు బెదిరించిన ఫామ్ హౌజ్ నిర్వాహకులు..కొద్ది రోజులుగా ఫామ్ హౌజ్ ల పరిసరాల్లో పశువులను మేతకు తీసుకురావొద్దని గ్రామస్థులను ఫామ్ హౌజ్ నిర్వాహకులు హెచ్చరించారు. ఫామ్ హౌజ్ కు చెందిన వారే కాల్పులకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

Related posts