telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ : … రవిప్రకాష్ కు .. బెయిల్ మంజూరు..

tv9 raviprakash on live

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఏబీసీఎల్‌ ఖాతాల నుంచి రూ.18కోట్లు అక్రమంగా తీసుకున్నారన్న అభియోగాలపై రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించడంతో గత కొన్ని రోజులుగా రవిప్రకాశ్‌ చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఈకేసులో రవిప్రకాశ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం .. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని, హైదరాబాద్‌ విడిచి వెళ్లవద్దని ఆదేశించింది.

సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో రవిప్రకాశ్‌ పై గురువారం మరో కేసు నమోదైంది. నకిలీ మెయిల్‌ ఐడీ సృష్టించి మోసం చేశారని ఫిర్యాదు అందడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్‌ జైలు నుంచి విడుదలకాగానే ఈకేసులో ఆయన్ను విచారించే అవకాశముంది.

Related posts