telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

టివీ5 మూర్తి స్థానంలో టీవీ9 రవి ప్రకాష్… జరగబోయేది ఇదేనా ?

Ravi-Prakash-TV9-

రవి ప్రకాష్ ఇవ్వాళ బెయిల్ పై బయటికి వచ్చారు. ఇంతకీ ఆయన ఏం చెయ్యబోతున్నారు. నిన్ననే ఆయన బెస్ట్ ఫ్రెండ్ జాఫర్ టివీ 5 లో జాయిన్ అయ్యారు. మరి రవి ఏం చేస్తారు ? అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న పరిస్థితులలో ఆయన కొత్త ఛానల్ పెట్టిన నెట్టుకొచ్చే పరిస్థితి లేదు. కానీ రకరకాల పరిస్థితుల నేపథ్యం లో ఆయన టీవీ 5 లో చేరతారని వార్తలు వస్తున్నాయి. సహజం గానే టివీ5, టీడీపీ కి దగ్గర అవడం తెలిసిన విషయమే. టీవీ9 రవి ప్రకాష్ కూడా చంద్రబాబు మీడియా అనుచరుల్లో ఒకడని అనడానికి జగన్ & పవన్ కళ్యాణ్ పై తాను ప్రసారం చేసిన వార్త కథనాలే నిదర్శనం. అయితే టివీ5 ని రవి ప్రకాష్ కలయిక వెనక ఉంది కూడా చంద్రబాబే అని సమాచారం. మార్కెట్ లో ఒక స్థాయిలో ఉండడంతో టీవీ 5 అయితేనే తొందరగా జనాలలోకి వెళ్లొచ్చు అనేది ఆయన ఉద్దేశంగా అనిపిస్తుంది అనేది పరిశీలకుల మాట. అందుకే జాఫర్ ను ముందుగా పంపించారు అని మీడియా సర్కిల్ లో వినవస్తున్న మాట. అయితే టీవీ 5 లో ఇప్పుడు అంతా మూర్తిదే రాజ్యం నడుస్తుంది. మూర్తి తిరగని ఛానల్ అంటూ లేదు. ఇప్పుడు రవి ప్రకాష్ ఎంట్రీతో మూర్తి ఎగ్జిట్ అవ్వడం ఖాయం అంటున్నారు చాలామంది. ఇదే గనుక జరిగితే మూర్తిని టీవీ9 లోకి లాగేసుకోడానికి యాజమాన్యం సిద్ధంగా ఉందట. ఎలాగూ టివీ 5 ఇప్పుడు గడ్డు పరిస్థితిలో ఉంది. ఒక పక్క టిఆర్పిలు నేల చూపులు చూస్తున్నాయి. మిగతావారు ముందుకు దూసుకు పోతున్నారు. కాబట్టి రవి చేరిక వారికి కూడా మంచిదే అనేది మీడియా వర్గాలలో వినవస్తుంది. అసలేం జరుగుతుందో చూడాల్సిందే.

Related posts