telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

రవిప్రకాశ్ కు హైకోర్టులో చుక్కెదురు..

tv9 raviprakash mismatched answers

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు హైకోర్టు లో మరోసారి చుక్కెదురైంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసులో రవిప్రకాశ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. టీవీ9 తెలుగు లోగోతో పాటు మొత్తం ఆరు లోగోలను ఆయన సొంత వెబ్‌చానల్‌ మోజోటీవీకి దొంగచాటుగా బదిలీ చేశారని ఆరోపిస్తూ ఏబీసీపీఎల్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

ఈ క్రమంలో ముందస్తు బెయిల్ లో ఉన్న నిబంధనలను తొలగించాలంటూ రవి ప్రకాశ్ పెట్టుకున్న పిటిషన్ ను హై కోర్టు తిరస్కరించింది. పోలీస్ స్టేషన్ లో వ్యక్తిగతంగా హాజరవకుండా మినహాయింపు ఇవ్వాలని, విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని తన పిటిషన్ లో రవిప్రకాశ్ అర్థించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు రవిప్రకాశ్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

Related posts