telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు

టీవీ9 రవిప్రకాష్ : లుక్ అవుట్ నోటీసులు..లాయర్ ఇంటిలో సోదాలు..పలు కీలక ..

Ravi Prakash

మాజీ సీఈవో రవిప్రకాశ్ పై టీవీ9 చానల్ వివాదంలో ఉచ్చు మరింతగా బిగుస్తోంది. ఇప్పటికే ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రవిప్రకాశ్ న్యాయవాది జె.కనకరాజు నివాసంలో ఇవాళ సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

ఈ ఆధారాలలో చానల్ యాజమాన్య మార్పుకు సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు కూడా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. లభించిన ఆధారాలను బట్టి ఫోర్జరీ పత్రాలను తయారుచేయడంలో రవిప్రకాశ్ కు తోడ్పడ్డారని న్యాయవాది కనకరాజుపైనా పోలీసులు అభియోగాలు మోపారు.

Related posts