telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

అజ్ఞాతంలోకి రవిప్రకాశ్..సెల్‌ఫోన్ స్విచ్చాఫ్!

Ravi Prakash

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. విచారణ నిమిత్తం శనివారం సైబరాబాద్ ప్రత్యేక పోలీసు బృందం, సైబర్ క్రైమ్ అధికారులు బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన కనిపించకపోవడంతో ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆయన ఎక్కడికి వెళ్లారో తమకు తెలియదని, తమకేమీ చెప్పలేదని రవిప్రకాశ్ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

రవిప్రకాశ్ ఫోన్లు కూడా స్విచ్చాఫ్‌లో ఉండడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని భావిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆయన కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. విచారణకు హాజరు కానీ నటుడు శివాజీకి మరోమారు నోటీసులు పంపనున్నట్టు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈసారి కూడా హాజరు కాకపోతే ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిని పోలీసులు శనివారం రెండో రోజూ విచారించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది.అయితే, రవిప్రకాశ్ విచారణకు సహకరిస్తారని, ఇందుకోసం పది రోజుల గడువు కావాలని రవిప్రకాశ్ తరపు న్యాయవాది పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేసినట్టు సమాచారం.

Related posts