telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కష్టాల్లో టీవీ నటి… నగలు కూడా అమ్ముకుని…!?

Nupur

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ప్రముఖ హిందీ టీవీ నటి నూపుర్ అలంకార్ ఇప్పుడు దయనీయ స్థితిలో కాలం వెళ్లబుచ్చుతోంది. ప్రస్తుతం రోజు గడవడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేవని తెలుస్తోంది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో- ఆపరేటివ్ బ్యాంకుకు గత సెప్టెంబరు 24న భారతీయ రిజర్వ్ బ్యాంకు ఒక నోటీసు పంపించింది. దీనిలో పీఎంసీ బ్యాంకు ఆరు నెలల వరకూ నూతనంగా ఎటువంటి లావాదేవీలు చేయకూడదని ఆదేశించింది. దీంతో ఈ బ్యాంకుకు చెందిన ఖాతాదారులు రూ. 25 వేలకు మించిన మొత్తాన్ని తీసుకోలేకపోతున్నారు. నూపుర్‌కు ఈ బ్యాంకులోనే ఖాతా ఉంది. దీంతో ఆమెకు సమస్యలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా నూపుర్ మాట్లాడుతూ తాను చాలా కష్టాలను ఎదుర్కొంటున్నానని, తనకు మరో బ్యాంకులో ఖాతా లేదని తెలిపింది. తన సంపాదన మీదనే ఆధారపడి తల్లి, సోదరి, భర్త, అత్తామామలు జీవిస్తున్నారని పేర్కొంది. ఇప్పుడు డబ్బులు లేకుండా ఎలా జీవించాలో తెలియడం లేదని, ఉంటున్న ఇంటిని అమ్ముకోవాల్సి వస్తున్నదని అన్నారు. ఇప్పుడు తాము రోజువారీ ఖర్చుల కోసం ఇంటిలోని బంగారు, వెండి నగలను అమ్ముకోవలసి వస్తున్నదన్నారు. అలాగే తెలిసినవారి నుంచి ఇప్పటివరకూ రూ. 50 వేలు అప్పు చేశానన్నారు. ఇప్పుడు బ్యాంకులోని తమ డబ్బులు పోతాయేమోనన్న భయం పట్టుకున్నదని అన్నారు.

Related posts