telugu navyamedia
రాజకీయ వార్తలు

సిరియన్‌ కుర్దిష్‌ లపై .. దాడులు ఆపేది లేదన్న .. టర్కీ ..

turky no to stop firing on sirians

టర్కీ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డొగాన్‌ సిరియన్‌ కుర్దిష్‌ మిలిటెంట్ల పై కాల్పుల విరమణ పాటించాలన్న అమెరికా ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఈ అంశంపై అమెరికాతో చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తనతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌ టర్కీ సిరియాలోని కుర్దిష్‌ దళాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించారని, ఇందుకు సంబంధించి టర్కీకి ఒక ప్రతినిధి వర్గాన్ని పంపాలని నిర్ణయించారని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ నేతృత్వంలోని ఈ ప్రతినిధి వర్గం బుధవారం అంకారాకు చేరుకున్నదన్నారు. అయితే తాను కుర్దిష్‌ దళాలతో కాల్పుల విరమణకు అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇతర అంశాలపై చర్చించటానికి ముందే కాల్పుల విరమణను తాము ప్రకటించబోమని తాను ట్రంప్‌కు స్పష్టం చేసినట్లు రిసెప్‌ చెప్పారు. ముందుగా ఒక ఒప్పందం కుదిరిన తరువాతే శాంతి గురించి మాట్లాడాలని ఎర్డొగాన్‌ను ఉటంకిస్తూ టర్కీష్‌ అధికార టీవీ ఎన్‌టీవీ వెల్లడించింది. టర్కీ సేనలు, ఆ దేశ మద్దతు వున్న మిలిటెంట్ల బారి నుండి సిరియాలోని అయిన్‌ ఇస్సాలో వున్న తమ సేనలను రక్షించుకునేందుకు యుద్ధ విమానాలను, గన్‌షిప్‌ హెలీకాప్టర్లను పంపినట్లు అమెరికా రక్షణశాఖ పెంటగాన్‌ వెల్లడించింది. సిరియాలో మకాం చేసిన తమ సేనల సమీపానికి టర్కీ సేనలు, మద్దతునిస్తున్న మిలిటెంట్లు వస్తున్నట్లు సమాచారం అందటంతో దీనిపై టర్కీ ప్రభుత్వానికి పెంటగాన్‌ ఫిర్యాదు కూడా చేసింది.

Related posts