telugu navyamedia
రాజకీయ వార్తలు

సేఫ్‌ జోన్‌ తప్పనిసరి అంటున్న .. టర్కీ

turkey demanding safe zone in syria

నిన్న మొన్నటివరకు రక్షణ దళాలతో యుద్ధ భూమిలా ఉన్న సిరియాలో తక్షణమే సేఫ్‌ జోన్‌ ఏర్పాటు చేయాలని టర్కీ డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో అమెరికా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టర్కీ విదేశాంగ మంత్రి మెవ్లత్‌ కవుసోగ్లూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సిరియాలో సేఫ్‌ జోన్‌ ఏర్పాటు కోసం అమెరికా ప్రయత్నించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

యూఎస్‌ యూరోపియన్‌ కమాండ్‌ డిప్యూటీ కమాండర్‌ స్టీఫెన్‌ ట్విట్టీ వచ్చేవారం సాన్‌లివుర్ఫా ప్రావిన్స్‌లో పర్యటించనున్నారు. సేఫ్‌ జోన్‌ ఏర్పాటు బాధ్యతలను ఆయనకు అప్పగించారు.

Related posts