telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తిరుమల డిక్లరేషన్ అంశంపై స్పందించిన తులసిరెడ్డి

Tulasireddy

తిరుమల క్షేత్రంలో శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్తులు ఇకపై డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నాయి.

తాజాగా ఈ ప్రకటనపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఘాటుగా స్పందించారు. తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం చేయడానికి సీఎం జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.

ఒకవేళ డిక్లరేషన్ పై సంతకం పెడితే తాను హిందువునని తెలిసిపోతుందని భయమా? లేకపోతే, వెంకటేశ్వరస్వామిపై నమ్మకం, భక్తి లేకనా? అని వ్యాఖ్యానించారు. నమ్మకం లేకుండా తిరుమలకు వెళ్లడం ఎందుకని అన్నారు. ముఖ్యమంత్రే నిబంధనలు ఉల్లంఘించాలని చూడడం సరికాదని హితవు పలికారు.

Related posts