telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

తులసి.. ఇది సర్వరోగనివారిణి…

tulasi for all health reasons

తులసిని పరమ పవిత్ర దేవతా స్వరూప మొక్కగా లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా భావించి ఆరాధించడం భారతీయుల దైనందిన జీవన విధానంలోని శ్రేష్ఠమైన అత్యున్నతమైన సదాచారం. తులసిని సంపదకి, సౌభాగ్యానికి చిహ్నంగా భావించడంతో పాటు ఆ తల్లి కరుణాకటాక్షవీక్షణాలు మన శారీరక, మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుతుందనీ విశ్వసిస్తాం. ఈ తులసిలో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

* 200 మి.లీ.ల నీటిలో గుప్పెడు తులసి ఆకులు, ఒక టీ స్పూను పంచదార కలిపి 100 మి.లీ.ల నీరు మిగిలేలా సన్నని మంట పైన మరిగించి వడకట్టి పూటకు 50 మి.లీ.ల టొప్పున సేవిస్తుంటే దగ్గు, జలుబు, జ్వరాలు తగ్గుతాయి.

* 100 మి.లీ మరుగుచున్న నీటిలో పది తులసి ఆకులు, ఒక గ్రాము యాలుకుల పొడి వేసి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడకట్టి తేనె కలిపి తాగాలి. ఇలా ప్రతిరోజు తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.

* వారానికోసారి రాత్రిపూట తలకి తులసి రసం పట్టించి ఉదయం తలస్నానం చేస్తుంటే పేల సమస్య తగ్గుతుంది. రొజూ రెండు పూటలా పూటకు 20 మి.లీ తులసి రసంలో 5 మి.లీ తేనె కలిపి తీసుకుంటుంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

* రోజూ ఒకసారి 100 మి.లీ నీటిలో 10 తులసి ఆకులు, అర టీస్పూను అతిమధుర చూర్ణం, అర టీ స్పూను తాటి కలకండ వేసి మరిగించి దించి చల్లార్చి వడకట్టి 100 మి.లీ కాచిన పాలు కలిపి సేవిస్తుంటే బాలింతల్లో పాలు సమృద్ధిగా ఏర్పడతాయి.

* నీడలో ఎండించి వస్త్ర గాలితం పట్టిన తులసి ఆకుల చూర్ణాన్ని రోజూ రెండు పూటలా పూటకు 1-2 గ్రాముల వంతున తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఇదే చూర్ణాన్ని ముక్కుపొడుంలా పీలుస్తుంటే ముక్కు దిబ్బడ, జలుబు, తుమ్ములు, తలనొప్పి, సైనసైటిస్ వంటి వ్యాధులు తగ్గుతాయి.

Related posts