ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు అందరూ వచ్చే రెండు సంవత్సరాలకు సరిపడే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. అందులో నాచురల్ స్టార్ నాని ఒక్కడు. ప్రస్తుతం నాని ”టక్ జగదీష్, అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్” సినిమాలతో పాటు ఈ ఏడాది చివరికి ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు.అయితే నాని ఇప్పుడు టక్ జగదీష్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్లు అలాగే ‘ఇంకోసారి.. ఇంకోసారి..’ అనే లిరికల్ వీడియో అందరిని ఆకట్టుకుంది. అయితే వేసవి కానుకగా ఏప్రిల్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. అదేంటంటే…అయితే.. తాజాగా టక్ జగదీష్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ పూర్తిగా మాటలతో కాకుండా థమన్ సంగీతం.. థీమ్ పాటతో సాగింది. నాని, రీతు లవ్ ట్రాక్‌తో పాటుగా.. ఫైటింగ్ సీన్స్ కూడా ఈ టీజర్‌లో చూపించారు. కాగా.. నాని కనిపించిన ప్రతి సీన్‌లోనూ టక్ ప్రత్యేకంగా నిలిచింది. ఈ టీజర్ మూవీ అంచనాలను సైతం అమాంతం పెంచేసింది. ఇక ఈ టీజర్‌పై నాని ట్వీట్ చేస్తూ.. “పండగకి వచ్చే సినిమాలు కొన్ని పండగలాంటి సినిమాలు కొన్ని” అంటూ తనదైన స్టైల్‌లో ట్వీట్ చేశాడు.
previous post