telugu navyamedia
ఆరోగ్యం

ట్యూబెక్టమీ తరువాత పిల్లలు ?

Why boys are interested in sleeping after sex?

మాకు ఒక బాబు. ఇక పిల్లలు వద్దనుకుని ట్యూబెక్టమీ (Tubectomy) చేయించుకున్నాను. మళ్ళీ పిల్లలు కావాలని రి-కేనలైజేషన్ చేయించుకొని మూడేళ్ళు అవుతోంది. ఇప్పటికీ పిల్లలు కలగలేదు. కారణం ఏంటి?

ముందు ట్యూబెక్టమీ చేయించుకున్నారని తెలిపారు. పిల్లలు కావాలని ట్యుబాల్ రీకేనలైజేశన్ చేయించుకున్నా వెంటనే గర్భము ధరిస్తారని చెప్పలేము. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

ఒకసారి వేరుచేసి తిరిగి జతచేసిన ట్యూబులు కనీసం 6 నుంచి 7 సెంటీ మీటర్లు పొడవు ఉండాలి. జతచేసిన బాగాలు రెండు వైపులా సరిగా అమరాలి. ఇన్ఫెక్షన్ రాకూడదు. అండోత్పత్తి జరుగుతూ ఉండాలి. భర్త స్పెర్మ కౌంట్ సరిపడినంత ఉండాలి. అప్పుడు కూడా గర్భము ధరించడానికి 25 నుండి 75 శాతము దాకా అవకాశము మాత్రమే ఉంటుంది. గర్భధారణ జరుగుతుందా లేదా అన్నది తెలుసుకునేందుకు లాప్రోస్కోపి, ఎహ్.యస్.జీ. పరీక్షలు ఉపయోగపడతాయి. ఒకవేళ వాటి పని తీరు సరిగా లేకపోయినా, ట్యూబులు మూసుకు పోయినా టెస్ట్ ట్యూబ్ బేబీకి ప్రయత్నించవచ్చును. ముందుగా మీరు డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Related posts