telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

టీటీడీ పాలక మండలి .. సభ్యుల పెంపుకు కార్యాచరణ.. పలువురికి చోటు..

TTD gold thefted will be to Tirumala today

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్య ను ప్రస్తుతం ఉన్న 19 మంది సభ్యుల స్థానంలో మొత్తం 25 మందికి చోటు కల్పించాలని నిర్ణయం తీసుకుని గవర్నర్‌ ఆమోదానికి పంపింది. ఆయన సంతకం కాగానే సభ్యుల నియామకం ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే పాలక మండలి సభ్యుల జాబితా ఖరారయిందని, గవర్నర్‌ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారని భావిస్తున్నారు. ఈసారి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురికి పాలక మండలిలో చోటు కల్పించనున్నట్లు సమాచారం.

తమిళనాడు నుంచి ఇండియా సిమెంట్స్‌ ఎండీ ఎన్‌.శ్రీనివాసన్‌, కృష్ణమూర్తికు చోటు దక్కే ఛాన్స్‌ంది. పారిశ్రామిక వేత్త జూపల్లి రామేశ్వరరావు పేరు కూడా వినిపిస్తోంది. ఇక ఏపీకి సంబంధించి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, యలమంచిలి ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు పేర్లు వినిపిస్తున్నాయి. తుడా చైర్మన్‌ హోదాలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎలాగూ మండలిలో ఉంటారు.

Related posts