telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

టీటీడీ కీలక నిర్ణయం… సోమవారం నుంచి..?

ttd plans to venkanna temples in mumbai and j & K

మన దేశంలో కరోనా కేసులు విపరీతంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో మాత్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రలో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే ఈ కరోనా వ్యాప్తి దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి టైమ్ స్లాట్ సర్వదర్శన టోకెన్ల జారీని సోమవారం నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం వద్ద భక్తులకు సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్నారు. అయితే..ఈ కౌంటర్ల క్యూలైన్ల వద్దకు భక్తులు గుంపులుగా చేరుతుండటంతో కరోనా వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని టీటీడీ భావించింది. భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా సర్వదర్శన టైమ్ స్లాట్ టోకెన్లను ఈనెల 11వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే జారీ చేస్తామని తెలిపింది. 12వ తేదీ నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి సర్వదర్శన టోకెన్ల జారీపై వివరాలను ముందుగానే తెలియజేస్తామంది. 3 వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కొనసాగుతాయని టీటీడీ స్పష్టంచేసింది. అయితే చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts