telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నేడు టీటీడీ పాలకమండలి సమావేశం…

టీటీడీ పాలకమండలి సమావేశంలో టెబుల్ అజేండగా మరిన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది.తిరుమలలో మూడో దశలో 1389 సిసి కెమెరాలు ఏర్పాటుకు టెండర్లు ఖరారు చేయనున్నారు. ఇక ధార్మిక ప్రచారంలో భాగంగా కళ్యాణమస్తూ,ఎస్సి ఎస్టి బిసి కాలనీలో 500 ఆలయాలు నిర్మాణం త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. హౌసింగ్ సొసైటీ నిబంధనల మేరకు ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించనున్నారు. హిందూ దేవాలయాలకు ఇచ్చే విగ్రహాలు కేటాయింపు సబ్సిడీ 3లక్షలకు తగ్గించాలని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. టీటీడీ విద్యాసంస్థలలో చదువుకునే హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా ఆహారం పంపిణీ చేయనున్నారు. ఏటీసీ,వరాహస్వామి అతిధి గృహం,ఉద్యోగుల కాటేజీలు ఆధునికరణ… కాకులమాను కొండ వద్ద వున్న విండ్ పవర్ ను 10ఏళ్ళు పాటు ఉచితంగా మైంటైన్స్ కు గ్రీంకో ఎనరజిస్ కు కేటాయించనున్నారు. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం మండలం వడ్డపల్లెలోని వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద అమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నారు. 25ఏళ్ళు పాటు సోలార్ విద్యుత్ కొనుగోలుకు ఎన్టిపీసీతో ఎంవోయూ… మొదటి ఘాట్ రోడ్డులోని 57వ మలుపు నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సేఫ్టీ మెష్ ఏర్పాటు. చేయనున్నారు.

Related posts