telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి!

yv subbareddy

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్ పదవికి పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు కొత్త చైర్మన్ గా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఇటీవలే వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు చెప్పారు. శనివారం మంచిరోజు అని తనకు సూచనలు, సలహాలు వచ్చాయని అన్నారు. కాగా, టీటీడీ బోర్డు కొత్తసభ్యులు కూడా అదేరోజున ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Related posts