telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన టీటీడీ

తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్‌కు ఇవాళ టీటీడీ ఆమోద ముద్ర వేసింది. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం సమావేశమైన పాలకమండలి 2021-22 ఆర్థిక సంత్సరానికి గానూ రూ. 2937 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతిస్తామని భక్తులకు తిపి కబురును చెప్పారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. టీటీడీ పరిధిలోకి వచ్చే ఆలయాలకు విధి విధానాలను ఖరారు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దేశంలోని అన్ని కళ్యాణ మండపలను అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. టీటీడీ వేద పాఠశాలలను ఎస్వీ వేద విజ్క్షాన పీఠంగా పేరు మార్చుతున్నామని వెల్లడించారు. బర్డ్‌ ఆస్పత్రి భవనంలో పిల్లల ఆస్పత్రి ఏర్పాటుకు రూ. 9 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. అయోధ్యలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు.

Related posts