telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

త్వరలోనే రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు… ఛార్జీల మోత మోగనుందా ?

TSRTC

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. రాష్ట్రంలోని గ్రీన్ జోన్ల పరిధిలో 50 శాతం ఆక్యుపెన్సీతో బస్సులను నడపనున్నారు. చాలా బస్సుల్లో 40-50 సీట్లు ఉండగా.. భౌతిక దూరం పాటించడం కోసం ఇద్దరు కూర్చునే సీట్లో ఒకరు చొప్పున ప్రయాణికులను కూర్చోనిచ్చే అవకాశం ఉంది. అంటే 40 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న బస్సుల్లో 20 మందికి మాత్రమే అనుమతి ఇస్తారు. భౌతిక దూరాన్ని పాటించడంతోపాటు బస్సు ఎక్కడానికి ముందే ప్రయాణికులకు శానిటైజర్లను అందజేస్తారు. కౌంటర్లలో టికెట్లు విక్రయిస్తే సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కుదరకపోవచ్చు కాబట్టి.. ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయించేందుకు కూడా ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకూ వజ్ర, గరుడ ప్లస్, గరుడ, రాజధాని, సూపర్ లగ్జరీ లాంటి సర్వీసులకే ఆన్‌లైన్ రిజర్వేషన్ సదుపాయం ఉండగా.. ఇక నుంచి అన్ని రకాల సర్వీసులకు ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బస్సులను నడిపే విషయమై ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం ఆర్టీసీ ఎదురు చూస్తోంది. మే 15న ప్రభుత్వం ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత 50 రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. గత ఏడాది సిబ్బంది సమ్మె కారణంగా 52 రోజులపాటు బస్సులు తిరగలేదు. దీంతో ఆర్టీసీ భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభమైనా 50 శాతం సీటింగ్ కెపాసిటీతోనే నడవనుండటంతో… దానికి అనుగుణంగా ధరలను పెంచే యోచనలో ఆర్టీసీ ఉంది.

Related posts